Just In
Don't Miss!
- Finance
startup India seed fund: స్టార్టప్స్ కోసం రూ.1000 కోట్ల నిధి
- News
కామపిశాచి: 22ఏళ్లకే 11 పెళ్లిళ్లు -భార్య ముందే బాలికపై రేప్ -స్నేహితులతో సెక్స్‌కు ఒత్తిడి -లవ్లీ గణేశ్
- Sports
టీమిండియాను విమర్శించిన స్టార్క్ సతీమణి.. మతిభ్రమించిందంటూ మండిపడ్డ ఫ్యాన్స్!
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నన్ను నన్నులాగే చూడండి మరొకరితో పోల్చిచూడొద్దు ప్లీజ్.. !?
విక్రమ్ నటించిన తమిళ చిత్రం ' దైవతిరుమగళ్"తో తమిళ, తెలుగు భాషల్లో పరిచయమైన భామ అమలాపాల్. 'మైనా"(తెలుగులో 'ప్రేమఖైదీగా" విడుదలైంది) చిత్రంతో నటిగా మంచి గుర్తింపు పొందిన అమలాపాల్ స్టార్ తిరిగింది. ఒక్క సినిమాతోనే దక్షిణాది ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ డబ్బింగ్ సినిమాతో కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా మరింత క్రేజ్ మాత్రం సొంతం చేసుకొన్నది. ఆక్రేజ్ తోనే రామ్ గోపాల్ వర్మకు పట్టుబడింది. వర్మ దర్శకత్వంలో అమలాపాల్ ప్రస్తుతం నాగచైతన్య సరసన 'బెజవాడ" చిత్రంలో నటిస్తున్న విషయం విధితమే.
అలాగే తమిళంలో మాధవన్ తో 'వెట్టె" చిత్రంలోనూ నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో మరి కొన్ని చిత్రాల్లో అమలాపాల్ కు అవకాశాలొస్తున్నాయి. దీంతో పాటు ఓ బాలీవుడ్ కథానాయకుడు అమలను బాలీవుడ్ తెరకు పరిచయం చేయాలని ఆమె అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడట. ఈ సందర్భంగా అమలాపాల్ మాట్లాడుతూ 'చేసింది రెండు చిత్రాలే అయినా అవి నటిగా నాకు మంచి గుర్తింపుని తెచ్చి పెట్టాయి. ఆ చిత్రాల తర్వాత తమిళంలోనూ, తెలుగులోనూ భారీ చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. అంతే కాకుండా బాలీవుడ్ చిత్రాల్లో నటించమని అడుగుతున్నారు. పైగా నన్ను దీపికా పదుకునేలా వున్నావని అంతా అంటున్నారు. నన్ను మరొకరితో పోల్చడం నాకు అస్సలు నచ్చదు. నన్ను నన్నుగానే చూడండి మరొకరితో పోల్చిచూడొద్దు ప్లీజ్ అంటోంది అమలాపాల్.