»   » ఇలాంటివి చిరు పరువు తియ్యటానికే చేస్తున్నట్లే అనిపిస్తోంది..లేకపోతే ఏంటి?

ఇలాంటివి చిరు పరువు తియ్యటానికే చేస్తున్నట్లే అనిపిస్తోంది..లేకపోతే ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆ మధ్యన సంపూర్ణేష్ బాబు సినిమా పబ్లిసిటీ వ్యవహారంలో ఓవర్ యాక్షన్ తో కామెడీ పండించారు. అయితే అదంతా సరదాకే అని అందరికీ తెలుసు. ఇప్పుడు చిరంజీవి తాజా చిత్రం ఖైదీ నెంబర్ 150 కు సంభందించిన ఓ ట్వీట్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇవన్నీ చూస్తూంటే చిరంజీవి మీద అభిమానంతో చేస్తున్నారా లేక ఆయన పరువు తీయటానికి వెటకారంగా ఇలాంటివి చేస్తున్నారా అనే సందేహం రాకమానదు.

''ఇప్పుడే చిరంజీవితో ఫోన్లో మాట్లాడాను. అతడొక గొప్ప మనిషి. చాలా మంచి సినిమా తీశాడు. ఆయన 150వ సినిమా అయిన ఖైదీ నెంబర్ 150ని చూశాను. భార్య మెలానియా, కుమార్తె ఇవాంకాతో కలిసి సినిమాను ఎంజాయ్ చేశా. బాస్ ఈజ్ బ్యాక్'' అంటూ ఆ ట్వీట్ లో ఉంది.

Donald trump tweet on Chiranjeevi's movie

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయటమేంటి. మెగాస్టార్ చిరంజీవిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించటం ఏమిటి అనే సందేహం రావటం లేదా..
నిజానికి అందరూ అనుకుంటున్నట్లు ట్రంప్ ఏమీ చిరంజీవికి ఫోన్ చేయలేదు. ఫోటోలో కనిపిస్తున్న ట్వీట్ కూడా అబద్దమే.

ఓ నెటిజన్ క్రియేట్ చేసిన ఈ ట్రంప్ ట్వీట్‌.. సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. కొంతమంది అయితే ట్రంప్ నిజంగానే ఫోన్ చేసి, మెగాస్టార్‌ను అభినందించారేమో అని భ్రమపడి.. ఆ ట్వీట్‌ను షేర్ కూడా చేస్తున్నారు. జనం ఇలా పరాకాష్టగా పబ్లిసిటీ చేస్తున్నారు.

ఇక్కడితో ఆగకుండా...ఖైదీ నెంబర్ 150 చిత్రం రిలీజ్ సందర్భంగా ట్రాఫిక్ ను అదుపు చేసేందుకు వాహనాల రూట్ మళ్లించినట్లు అమెరికాలోని ఓ ప్లైఓవర్ స్ర్కీన్ పై స్క్రోలింగ్ చూపిస్తూ మరో వాట్సాప్ మెసేజ్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Donald trump tweet on Chiranjeevi's movie

మెగాస్టార్ చిరంజీవిని ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా? అన్న తన అభిమానుల కల నెరవేర్చేస్తూ దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇస్తూ చిరు 'ఖైదీ నంబర్ 150'తో వచ్చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్యన జనవరి11న విడుదలైన ఈ సినిమా అభిమానులను విపరీతంగా ఆకట్టుకొని సూపర్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. చాలా చోట్ల తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన బాహుబలిని సైతం బ్రేక్ చేస్తూ ఖైదీ నంబర్ 150 రికార్డు వసూళ్ళు రాబడుతోంది.

ఇక ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అభిమానులు, ప్రేక్షకుల దగ్గర్నుంచి వస్తోన్న రెస్పాన్స్ అద్భుతంగా ఉందని, ఇంతటి పెద్ద విజయాన్ని అందించిన అభిమానులకు థ్యాంక్స్ అని తెలిపారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మించారు.

English summary
President-elect Donald Trump tweeted on Chiranjeevi's Khadi no 150 movie?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu