twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ పై దాడి వెనక సీక్రెట్

    By Srikanya
    |

    నిన్న వికారాబాద్ లో మహేష్ బాబుపై తెలంగాణ వాదులు దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మీడియాలో హైలెట్ గా కూడా వచ్చింది. అయితే ఈ దాడి వెనక అస్సలు ఉద్దేశ్సాలు వేరని, వేరొక వాస్తవం ఉందని స్దానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు దూకుడు చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడే ఈ దాడి జరిగింది. వారు చెప్పేదాని ప్రకారం సంవత్సరం క్రితం ఎటివి నిర్మించిన బిందాస్ షూటింగ్ ను కూడా వికారాబాద్ ప్రాంతంలో అడ్డుకున్నారు. ఇప్పుడు దూకుడు చిత్రం నిర్మిస్తుంది కూడా ఎటివీ వారే. ఎటివి వారికి లోకల్ గా స్దానికులతో సమస్యలు ఉన్నాయి.

    నాలుగేళ్ల క్రితం ఎటివి సంస్థ యాజమాన్యం వికారాబాద్ ప్రాంతంలో డెబ్బై ఎకరాలుకు పైగా భూములు కొనుగోలు చేసింది. కొనుగోలు చేసినప్పుడు స్థానికులకు అక్కడ స్థాపించే స్టీల్ కర్మాగారం, ఇంకా ఇతర కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తూ ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చేశారు. అయితే భూములు ఇచ్చేసి, కంపెనీలు ప్రారంభమైన తర్వాత అక్కడి వారికి కాకుండా ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చారని అభియోగం. దీంతో నాలుగేళ్లుగా స్థానికంగా ఎటివి యాజమాన్యంపై విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దాని ఎఫెక్టే సినిమాలను అడ్డుకోవటం అంటున్నారు.

    ఎటివి నిర్మించే సినిమాలను తెలంగాణవాదులు పేరిట స్థానికులు అడ్డుకున్నట్లు సమాచారం. ఎందుకంటే ఎటివి సంస్థ కాకుండా ఇతర సినిమాలను వేటినీ వికారాబాద్‌లో అడ్డుకోకపోవడం గమనించతగ్గ విశేషం. ఎందుకిలా తెలంగాణ పేరు చెప్పి అడ్డుకోవటం అంటే...తెలంగాణ వాదం లేకపోతే కేసులు పెడతారని భావించి ఇలా చేస్తున్నట్లు వికారాబాద్ వాసులు కొంతమంది చెప్తున్నారు. ఆ కంపెనీ వల్ల నష్టపోయి, కడుపు మండిన వారే ఇలా చేసినవారిలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న టీఆర్‌ఎస్ నేతలు మద్ధతిచ్చారని తెలుస్తోంది.

    English summary
    Telangana supporters attacked s Mahesh Babu at Dookudu shooting spot in Vikarabad. T supporters has broken the car mirrors in which Mahesh was traveling. They also attacked the Dookudu team and spoiled the set. Finally, Mahesh escaped from the location and reached Hyderabad in another car.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X