For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ ఇగో దెబ్బతిందా? నిజమా?

  By Srikanya
  |

  హైదరాబాద్ : క్రియేటివ్ ఫీల్డ్ లో ఇగో లు క్లాష్ అవటం అనేది అతి సామాన్య విషయం. అయితే దాన్ని ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకోరు. అవసరాలు,పరిస్ధితులకు తగినట్లు సర్దుకుపోతూ ప్రాజెక్టుని హిట్ చేయటానికి ప్రయత్నిస్తూంటారు. రీసెంట్ గా ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ మధ్య ఇగో క్లాష్ అయ్యిందంటూ వార్త వెబ్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. అయితే ఎంత వరకూ నిజమనేది మాత్రం తెలియటం లేదు. కాకపోతే పూరి జగన్నాథ్ గురించి తెలిసిఉన్నవారు మాత్రం అటువంటి వాతావరణం పూరి పొరపాటున కూడా క్రియేట్ చేయడు అంటున్నారు.

  మధురిమను సెకండ్ హీరోయిన్ గా తీసుకోవటంతో ఈ క్లాషెష్ వచ్చాయంటున్నారు. దాంతో షూటింగ్ కు హాజరుకావటం లేదని వినిపిస్తోంది. మరో ప్రక్క పూరీ జగన్నాథ్ సైతం రెగ్యులర్ తనే కథ,మాటలు రాసుకుంటూంటారు. అలాంటిది ఇలా వేరే వారి కథతో రంగంలోకి దిగటం కూడా ఆయనకు ఇష్టం లేదని అంటున్నారు. అయితే ఇవన్నీ రూమర్సా కాదా అన్నది మాత్రం తేలాల్సి ఉంది.

  పూరి జగన్నాథ్ మాత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభించి కామెడీ సీన్స్ ఫినిష్ చేసి ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ దాదాపు పూర్తి తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ రావాల్సి ఉంది. అది మాత్రం జరగలేదని వార్త. కానీ త్వరలోనే ఏమన్నా పొరపొచ్చాలు ఉన్నా,క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నా సర్దుకుని ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్తారని అబిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రానికి నేనోరకం అనే టైటిల్ పరిశీనలో ఉంది.

  Ego clash between Jagan and NTR

  ఇక నేనో రకం చిత్రం విషయానికి వస్తే.... ఎన్.టి.ఆర్ , పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఓ సినిమా సెట్స్ పైన ఉన్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. వక్కంతం వంశీ ఈ సినిమా కోసం చాలా కొత్త కథని అందిస్తే, దానికి పూరి జగన్నాధ్ తన ట్రేడ్ మార్క్ డైలాగ్స్, ఫాస్ట్ స్క్రీన్ ప్లే ని జోడించాడు. గతంలో వక్కంతం వంశీ..ఎన్టీఆర్ నటించిన అశోక్, ఊసరవెల్లి చిత్రాలకు కథలు అందించారు.

  నిర్మాత బండ్లగణేష్ మాట్లాడుతూ...' మా సంస్థ నిర్మించిన 'బాద్‌షా' చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయి, ఎన్టీఆర్ కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ చిత్రనిర్మాణసమయంలోనే మరో సినిమా చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చారు. పూరి జగన్నాథ్‌గారు నాకు సొంత సోదరుడు లాంటివాడని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తియ్యాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరవేరుది. ఈ చిత్రానికి వక్కంతం వంశీ అద్భుతమైన కథ అందించారు' అన్నారు.

  కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి కథ: వక్కంతం వంశీ, సమర్పణ: శివబాబు బండ్ల, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

  English summary
  
 NTR is not happy with what is happening in Puri’s Cave and is upset about the fact that Puri has got Madhurima as second heroine in this cop saga.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X