Just In
- 1 min ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 57 min ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
- 1 hr ago
ఆ విషయాల్లో ఎప్పుడూ ఆలస్యం అనేది ఉండదు.. సింగర్ సునీత పిక్స్ వైరల్
- 2 hrs ago
మరో మాస్ యాక్షన్ సినిమా కోసం తమిళ దర్శకుడిని లైన్ లో పెట్టిన రామ్
Don't Miss!
- News
నిమ్మగడ్డ సంచలనం: ఇద్దరు కలెక్టర్లు సహా 9మందిపై వేటుకు ఆదేశం -ఎన్నికలకు అడ్డొస్తే అంతే!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Sports
ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!
- Finance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటా
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిర్మాతకు షాకిచ్చిన మెహ్రీన్.. అలాంటి బిల్లులు కూడా పంపిందట..
అందాల భామ మెహ్రీన్ పిర్జాదా సంక్రాంతి పండుగపై పెట్టుకొన్న ఆశలు ఆడియాశలయ్యాయి. తమిళంలో ధనుష్‌తో చేసిన పటాస్, కల్యాణ్ రామ్‌తో చేసిన ఎంత మంచివాడవురా సినిమాలు పెద్దగా ఆశించినంతగా ఆడకపోవడం, బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించకపోవడంతో సినిమా యూనిట్ నిరుత్సాహపడిందనే విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ముఖ్యంగా ఎంత మంచివాడవురా సినిమా ప్రొడ్యూసర్లకు మెహ్రీన్ ఓ ఘోరమైన షాకిచ్చిందనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. ఇంతకు అదేమిటంటే..

సినిమా ప్రమోషన్‌లో పదనిసలు
ఎంత మంచివాడవురా సినిమా కోసం ప్రీ రిలీజ్ ప్రమోషన్‌లో మెహ్రీన్ పాల్గొన్నది. మొత్తంగా రిలీజ్‌కు ముందు రిలీజ్‌కు తర్వాత మూడు నుంచి నాలుగు రోజులపాటు ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నది. అయితే ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన సమయంలో వేసుకొన్న దుస్తులు, అందంగా కనిపించేందుకు బ్యూటీ పార్లర్ బిల్లులను భారీగా పంపించడంతో చిత్ర యూనిట్ షాక్ అయినట్టు తెలిసింది.

తడిసి మోపెడు అయిన బిల్లులు
ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో ఫైవ్ స్టార్ హోటల్‌లో లాండ్రికి అయిన ఖర్చులు, స్పా బిల్లులు తడిసి మోపడవ్వడం.. ఆ బిల్లులను చూసిన నిర్మాతలు కంగుతిన్నరట. దాదాపు రూ.50 వేల బిల్లును నిర్మాత చూసి షాక్ తిన్నారట. వాస్తవానికి అలాంటి బిల్లులను నిర్మాతలు భరించడం చేయరు.


భోజనం బిల్లుల కూడా
ఇక ఇదిలా ఉంటే.. ఫైవ్ స్టార్ హోటల్ నుంచి తెప్పించిన భోజనానికి కూడా బిల్లు పంపించడం చర్చనీయాంశమైంది. ఆ బిల్లు దాదాపు రూ.7 వేలు అవ్వడంతో ఆ బిల్లును కూడా కట్టమని సదరు నిర్మాతలకు చేరవేసిందట. అయితే ఇలాంటి కంప్లయింట్లు మెహ్రీన్‌పై రావడం ఇదే మొదటిసారి కాదని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

సర్దుకొంటున్న నిర్మాతలు
ప్రస్తుతం కొందరు హీరోయిన్ల కోరే గొంతెమ్మ కొర్కెలను తీర్చడానికి నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారట. ఇక ముందు ఇలాంటి ఖర్చులు చెల్లించకకుండా తగు జాగ్రత్తలు తీసుకొనేందుకు చర్యలు తీసుకొంటున్నారట. ప్రాజెక్ట్‌లో చేరే ముందు ఆయా ఖర్చులు చెల్లించబోమని ముందే అగ్రిమెంట్ రాసుకోవాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం.