»   » ఐరన్ లెగ్: మహేష్ ఫ్యాన్స్‌ను వెంటాడుతున్న సెంటిమెంట్

ఐరన్ లెగ్: మహేష్ ఫ్యాన్స్‌ను వెంటాడుతున్న సెంటిమెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘1' నేనొక్కడినే, ఆగడు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డ తర్వాత మహేష్ బాబు అభిమానులు కాస్త నిరాశ పడ్డారు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టి అభిమానులను సంతృప్తి పరచాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు ఈ సూపర్. అయితే మహేష్ బాబు ఎంత ప్రయత్నిస్తున్నా ఆయన్ను కొన్ని సెంటిమెంట్లు వెంటాడుతున్నాయి.

ఈరోస్ ఇంటర్నేషనల్... బాలీవుడ్లో పాపులర్ ప్రొడక్షన్ కంపెనీ. మహేష్ బాబు ‘1'నేనొక్కడినే సినిమాతో తెలుగు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సంస్థ తొలి ప్రయత్నం బెడిసి కొట్టింది. ఆ తర్వాత ఆ సంస్థకు మరోసారి మహేష్ బాబు అవకాశం ఇచ్చాడు. ‘ఆగడు' సినిమా రైట్స్ కూడా ఈరోస్ కే అమ్మారు. అయితే అది కూడా బాక్సాఫీసు వద్ద డీలా పడింది.


Eros Sentiment Haunting Mahesh Babu Fans

ఇది మాత్రమే కాదు....ఈరోస్ సంస్థ తెలుగులో రైట్స్ కొనుగోలు చేసిన ఏ సినిమా కూడా లాభాలతో ఆడిన దాఖలాలు లేవు. దీంతో ఆ సంస్థకు టాలీవుడ్లో ‘ఐరన్ లెగ్' అనే ముద్ర పడింది. ఆ సంస్థ ఏదైనా సినిమాను కొనుగోలు చేసిందంటే ట్రేడ్ వర్గాలు, ఆయా స్టార్స్ అభిమానులు హడలి పోతున్నారు.


తాజాగా ఈరోస్ సంస్థ ‘శ్రీమంతుడు' రైట్స్ కొనుగోలు చేయడంతో మహేష్ బాబు అభిమానులు కలవర పడుతున్నారు. అయితే అభిమానుల్లో కొందరు మాత్రం ఇలాంటి సెంటిమెంట్లన్నీ ట్రాష్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఈసారి ‘శ్రీమంతుడు' రైట్స్ కొనుగోలు చేసి ఈరోస్ సెంటిమెంటును తిరగరాస్తుందని, తమపై పడ్డ ఐరన్ లెగ్ ముద్రను తుడిచి పారేసుకుంటుందని నమ్ముతున్నారు.

English summary
Post 1 Nenokkadine and Aagadu debacles, Mahesh is keen on scoring a hit to satisfy his fans. However, the alleged bad luck seems to be not leaving Mahesh.
Please Wait while comments are loading...