»   » ప్రేక్షకులు ఒకరినొకరు కొట్టుకొనేలా చేసిన ఈటీవి సుమన్!

ప్రేక్షకులు ఒకరినొకరు కొట్టుకొనేలా చేసిన ఈటీవి సుమన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బుల్లితెర నుంచి వెండితెర మీదకు తన క్రియేటివ్ దాడిని డైరెక్ట్ చేసిన ఈ టీవీ సుమన్ తాజాగా 'నాన్ స్టాప్" సినిమాతో వచ్చాడు. మొదటి సినిమా'ఉషా పరిణయం" అనే పౌరాణిక ప్రయత్నం చేసి చేతులు కాల్చుకున్న సుమన్ ఈసారి కామెడీ సినిమాతో అదృష్టం పరీక్షించుకున్నాడు. ఈ చిత్రంలో కథానాయకులు ఎవరనే సంగతి సినిమా రిలీజయ్యే వరకు దాచి పెట్టిన సుమన్...

పాపం ప్రేక్షకులు తెలిసీ తెలియక థియేటర్లలో అడుగు పెట్టిన అమాయక ప్రేక్షకులని బెంబేలెత్తిస్తున్నాడు. 'నాన్ స్టాప్" లో హీరోలుగా ఈ సినిమా దర్శకుడు ఇంద్రనాగ్, సమన్ నటించేశారు. కామెడీ సినిమా పేరుతో విడుదలయిన ఈ సినిమా ఆడియన్స్ కి ట్రాజెడీ మిగులుస్తోంది. సినిమా పూర్తిగా చూడకుండానే వచ్చిన ఆ కొద్ది మంది ప్రేక్షకుల చేత పరుగులు పెట్టిస్తున్నారు. ఇది'రన్నింగ్ సక్సెస్ ఫుల్లీ" అంటూ ప్రకటనలు కూడా వేసుకుంటున్నారు. అంటే ఆడియన్స్ చేత సక్సెస్ ఫుల్ గా పరుగులు పెట్టిస్తున్నామనే అంతరార్ధం అందులో దాగుందో ఏమో! మరికొన్ని చోట్లయితే సుమన్ ను చూడగానే థియేటర్ల నుండి పరుగు తీయడానికి ప్రేక్షకులు ఒకరినొకరు కొట్టుకొన్నారంటే సుమన్ ఏరేంజ్ లో బయపెట్టాడో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ సినిమా థియేటర్లవైపు వెళ్ళే సాహసం చేయద్దని మనవి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu