»   » మరో రికార్డ్: '1' (నేనొక్కడినే) ఆడియో రైట్స్ రేటు

మరో రికార్డ్: '1' (నేనొక్కడినే) ఆడియో రైట్స్ రేటు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు,సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం '1-నేనొక్కడినే' . ఈ చిత్రం ఆడియో రైట్స్ రేటు ఇప్పుడు అంతటా షాక్ కి గురి చేస్తోంది. ఈ చిత్రం రైట్స్ ని దాదాపు కోటి రూపాయలకు ఇచ్చారని తెలుస్తోంది. బెంగుళూరుకి చెందిన లహరి ఆడియో కంపెనీ ఈ చిత్రం ఆడియో రైట్స్ ని సొంతం చేసుకుంది. ఎనభై లక్షలు రూపాయలు ఎమౌంట్ క్యాష్ ఇచ్చి..మరో ఇరవై లక్షల రూపాయలు ఆడియో పంక్షన్ కి ఖర్చు పెడతారని తెలిసింది. ఇది టాలీవుడ్ లో ఎవరూ ఊహించని రికార్డే. గతంలో మగధీర, రచ్చ వంటి చిత్రాలు దాదాపు 65 లక్షలు దాకా ఆడియో రైట్స్ పలికి రికార్డ్ క్రియేట్ చేసాయి.

సుకుమార్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ... నాకు చేతనైంది నేను తీస్తున్నాను. ఒకవేళ వేరే జానర్‌లో సినిమా తీయాలని నాకు అనిపించినా... నా దగ్గరకొచ్చే నిర్మాతలు ఒప్పుకోవడం లేదు. వాళ్లు ప్రేమకథల్నే అడుగుతున్నారు. నేనేం చేసేది! రాబోతున్న '1' నా గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది అన్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. అన్ని జానర్లూ టచ్ చేయగలిగిన మీరు... ఎప్పుడూ ప్రేమకథలే తీస్తారేం? అని అడిగితే ఆయన ఇలా స్పందించారు.

Fancy Price @ '1-Nenokkadine' Audio Rights

14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనన్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకుడు. గోవా షెడ్యూల్‌తో చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్టే. అక్కడే షూటింగ్ పూర్తికావటంతో గుమ్మిడికాయ కొడతారని సమాచారం. ఇక డిసెంబరులో నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకొని సంక్రాంతి పండగ నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. 'జనవరి 10న '1'ని తెచ్చేస్తున్నాం' అని మహేష్‌ కూడా చెప్పేశాడు. మహేష్‌కి సంక్రాంతి సీజన్‌ బాగా కలిసొచ్చింది 'ఒక్కడు', 'బిజినెస్‌మేన్‌', 'సీతమ్మ వాకిట్లో' ముగ్గుల పండక్కి విడుదలై విజయాన్ని సాధించాయి. ఇప్పుడు '1' కూడా పండగ బరిలో దిగబోతోంది.

అలాగే ఈ చిత్రంలో కృతిసనన్‌ ఓ టీవీలో న్యూస్‌ రీడర్‌గా పని చేస్తోంది. ఇందుకోసం ఆమె ఏవో వార్తలు చదువటాన్ని మొన్నా మధ్య రామోజీఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో షూట్ చేసారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. ఇక్కడ అందుకు సంబంధించిన సీన్లతో పాటు యాక్షన్ సీన్లు, చేజింగ్ సీన్లు చిత్రీకరించారు.

డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఛాయాగ్రహణం: రత్నవేలు, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

English summary
Mahesh's upcoming movie '1-Nenokkadine' are sold to Bangalore based music company Lahari. But a dig into the happening found out that our hero has created another record for the movie, with these audio rights.Though the buyers are not revealing the actual signed amount, it is heard that they will be giving around 80 lakhs in cash for the producers of '1' and rest amount they will invest on audio launch, music promotions and other audio related stuff. That accounts to a total of 1 crore, and this is a new record for Tollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu