»   » హాస్పిటల్ చేరిన త్రిష.. అది కాదట..

హాస్పిటల్ చేరిన త్రిష.. అది కాదట..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల తార త్రిషపై ఈ మధ్య కాలంలో ఏదో ఒక రూమర్ మీడియాలో ప్రచారమవుతున్నది. తాజాగా త్రిష అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ చేరినట్టు రూమర్ వైరల్‌గా మారింది. అయితే త్రిషపై వస్తున్న వార్తలను ఆమె తల్లి ఉమా కృష్ణన్ తోసిపుచ్చారు.

ఒట్టి రూమరే..

ఒట్టి రూమరే..

త్రిషపై వచ్చిన రూమర్ సరికాదు. ప్రస్తుతం ఆమె మలేషియాలో ఉన్నది. హీరో అరవింద్ స్వామితో జంటగా నటిస్తున్న శతురంగ వెట్టాయ్ 2 అనే చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నది అని ఉమ కృష్ణన్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం మోహిని, శతురంగా వెట్టాయ్ 2, గర్జనై తోపాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు.

అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరిక..

అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరిక..

ప్రస్తుతం ఫుడ్ పాయిజన్ కారణంగా త్రిష తీవ్ర అస్వస్థతకు గురైంది. చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు అనే వార్తలు మీడియాలో వైరల్‌గా మారాయి.

సుచీ లీక్స్‌లో రానాతో..

సుచీ లీక్స్‌లో రానాతో..

హీరో రానా దగ్గుబాటి, త్రిషకు ఎంగేజ్‌మెంట్ జరిగిందని గతంలో కూడా వార్తలు వెలువడ్డాయి. తాజాగా సుచీలీక్స్ వ్యవహారంలో త్రిష, రానా ఇద్దరు సన్నిహితంగా కలిసి ఉన్న చిత్రాలు ట్విట్టర్‌లో ప్రత్యక్షమయ్యాయి.

రానాతో అఫైర్

రానాతో అఫైర్

గత కొద్దికాలంగా రానా, త్రిష ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకొంటారని రూమర్లు వచ్చాయి. ఆ రూమర్లకు ఈ ఫోటోలు మరింత బలం చేకూర్చాయి. సుచీ లీక్స్ వ్యవహారంపై ప్రముఖులు ఎవరూ కూడా పెదవి విప్పకుండా జాగ్రత్త పడటం అనేక సందేహాలు రేకెత్తించాయి.

English summary
Film actress Trisha is hospitalized in Hyderabad owing to sickness from food poisoning. The actress' mother Uma Krishnan has cleared the air on the issue.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu