»   » ఎన్టీఆర్-సుకుమార్ మూవీ....డబ్బుల్లేకే ఆలస్యమా?

ఎన్టీఆర్-సుకుమార్ మూవీ....డబ్బుల్లేకే ఆలస్యమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉండగా ఇంకా మొదలు కాలేదు. కారణం ఏమిటీ? అంటే డబ్బుల సమస్యే అని అంటున్నారు.

‘అత్తారింటికి దారేది' లాంటి భారీ చిత్రాలను నిర్మించిన బివిఎస్ఎన్ ప్రసాద్ లాంటి నిర్మాత ....అంటే అసలు డబ్బుల సమస్యే ఉండదు. కానీ ప్రస్తుతం ఆయన నాగ చైతన్యతో ‘దోచేయ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెట్టబడి అంతా ఆ చిత్రంపైనే పెట్టడంతో డబ్బులు టైట్ అయ్యాయని టాక్. సమయానికి డబ్బులు అడ్జెస్ట్ కాక పోవడం వల్లనే ఇప్పటికే మొదలవ్వాల్సిన సినిమా ఇంకా మొదలు కాలేదని అంటున్నారు. ఎన్టీఆర్ సూచన మేరకు స్క్రిప్టులో మార్కులు చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. ఇందులో నిజం ఏమిటో తేలాల్సి ఉంది.

Financial Problems For NTR-sukumar Movie?

ఎన్టీఆర్, సుకుమార్ తొలి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ భారీ చిత్రం పూజా కార్యక్రమాలు గతేడాది డిసెంబర్ 18 ఉదయం 11.39 గంటలకు సంస్ధ కార్యాలయం చెన్నైలో జరిగాయి. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది.

చిత్రానికి దండయాత్ర అనే టైటిల్ ని పెట్టే అవకాసం ఉందని తెలుస్తోంది. ఇది దండయాత్ర...దయాగాడి దండయాత్ర అనేది పాపులర్ కావటంతో దండయాత్ర అనేదే ఫిక్స్ చేసే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఎన్టీఆర్‌ తండ్రిగా జగపతిబాబు నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్‌ తరహాలో వైవిధ్యంగా సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్‌ గెటప్‌ సరికొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

English summary
If the buzz from film nagar is to be believed NTR-sukumar Movie facing Financial Problems.
Please Wait while comments are loading...