»   »  నిజం: పవన్ సినీ కెరీర్ లోనే తొలిసారిగా...

నిజం: పవన్ సినీ కెరీర్ లోనే తొలిసారిగా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ కు చాలా ప్రత్యేకతలు రోజు రోజుకు యాడ్ అవుతున్నాయి. ఈ చిత్రంలో పవన్ తొలిసారిగా ఆయన కెరీర్ లోనే రెండు యూనిట్స్ తో వర్క్ చేస్తున్నారు. రెండు యూనిట్స్ ఒకేసారి వర్క్ చేస్తున్నాయి.

మెయిన్ యూనిట్ ...మేజర్ స్టార్స్ అందరి సీన్స్ అన్నీ కాప్చర్ చేస్తూ సాగుతుంది. దర్శకుడు బాబి దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు. రెండో యూనిట్..సినిమాలో పెద్దగా ప్రాముఖ్యత లేని సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఈ యూనిట్ కు ఇంఛార్జ్ గా కో డైరక్టర్ ఉండి చూసుకుంటున్నాడు.


ఇలా రెండు యూనిట్లతో ఎందుకు వర్క్ చేయాల్సి వస్తోంది అంటే...ఏప్రియల్ 8 వ తేది నాటికి ఎట్టిపరిస్దితుల్లోనూ సినిమాని విడుదల చేయాలనే అంటున్నారు. మార్చి ప్రారంభానికి సినిమా ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించాలని పవన్ ఆర్డరేసారని చెప్తున్నారు.


First time in Pawan's film career

బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సర్దార్ గబ్బర్ సింగ్' టీజర్స్ ద్వారా ఇప్పటికే క్రేజ్ వచ్చింది. దాంతో బిజినెస్ కూడా ఊపందుకుంది. ఈ సినిమాలో పవన్ మరోసారి గబ్బర్ సింగ్ పాత్రలో అలరించనున్నారు. కాజల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో రాయ్ లక్ష్మి, సంజన కీలక పాత్రల్లో కనపడనున్నారు.


తాజాగా ఈ సినిమాలో పవన్‌కి సంబంధించి మరో స్టిల్ విడుదల చేశారు సర్దార్ టీం. ఈ పోస్టరే మీరు ఇక్కడ చూస్తున్నది. నార్త్ ఎంటర్టైన్మెంట్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థలపై శరత్ మరార్, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌లో తెరమీదికి రానున్న ఈ సినిమా ఆడియో మార్చి‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

English summary
Pawan is working with two units for Sardaar Gabbar Singh.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu