»   » బ్రేక్: ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్‌ సినిమా లేదా?

బ్రేక్: ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్‌ సినిమా లేదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ‘గబ్బర్ సింగ్-2' చిత్రం ప్రారంభించబోతున్నారని అంతా అనుకుంటుండగా.....ఫిల్మ్ నగర్లో ఓ పుకారు మొదలైంది. ఈ సంవత్సరంలో ఆయన సినిమాలేవీ విడుదలయ్యే పరిస్థితి కనబడటం లేదంటున్నారు. ‘గబ్బర్ సింగ్-2' సినిమా మొదలు పెట్టాలని ప్రయత్నించినా బ్యాక్ పెయిన్ కారణంగా షూటింగ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 2015 ద్వితీయార్థంలోనే ఆ సినిమా మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు. అది పూర్తయి విడుదలయ్యేది 2016లోనే అంటున్నారు. మరి ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది.

గబ్బర్ సింగ్-2 ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మించనున్నారు. అలియాస్ జానకి చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన అనీషా ఆంబ్రోస్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనుంది. 'పవర్' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన బాబీ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందిస్తాడని తెలుస్తోంది. గబ్బర్ సింగ్-2 చిత్రానికి పవన్ కళ్యాణే స్టోరీ రాయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాస్తవానికి స్టోరీ, స్క్రీప్టు తయారు చేయడం లాంటి టాలెంట్ పవన్ కళ్యాణ్‌లో ఎప్పటి నుండో ఉంది. గబ్బర్ చిత్రంలో హిట్టయిన అంత్యాక్షరి టీం సీన్ పవన్ కళ్యాణ్ ఆలోచనే. ఆయన ఐడియాలజీ సినిమా హిట్ కావడానికి దోహద పడ్డాయి.

‘Gabbar Singh 2′ postponed?

గబ్బర్ సింగ్-2 చిత్రం గతంలో వచ్చిన గబ్బర్ సింగ్, దబాంగ్ చిత్రాలకుతో సంబంధం లేకుండా సరికొత్త కథతో ఆవిష్కరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మించబోతున్నారు. బ్రహ్మానందం, అలీ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. అంత్యాక్షరి గ్యాంగ్ కూడా ‘గబ్బర్ సింగ్-2'లో కూడా నటించనుంది.

English summary
Film Nagar source said that, ‘Gabbar Singh 2′ will start only in the second half of 2015, with an early 2016 launch date.
Please Wait while comments are loading...