»   »  'గబ్బర్ సింగ్' సీక్వెల్ టైటిల్ మార్పు కి అదా కారణం

'గబ్బర్ సింగ్' సీక్వెల్ టైటిల్ మార్పు కి అదా కారణం

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం 'గబ్బర్ సింగ్' కి సీక్వెల్ రెడీ అవుతన్న సంగతి తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం టైటిల్ మారే అవకాసం ఉందని సమాచారం. గబ్బర్ సింగ్ టైటిల్ కు షోలే నిర్మాతలు రాయల్టీ బాగా ఎక్కువ అడగటంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

  ఇక ఈసారి 'బెంగాళ్ టైగర్ ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు రెండవ వారంలో ప్రారంభమయ్యే అవకాసం ఉంది. ప్రారంభ సమయంలోనే పూర్తిగా నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ షెడ్యూల్ వివరాలు మీడియాకు రివిల్ చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం సంపత్ నంది పూర్తిగా అదే స్క్రిప్టుపై బిజీగా ఉన్నట్లు సమాచారం.

  ఇంతకు ముందే సంపత్ నంది మదిలో 'బెంగాల్ టైగర్' అనే టైటిల్ ఆలోచన ఉందట. అవకాశం వస్తే 'గబ్బర్ సింగ్-2' టైటిల్ 'బెంగాల్ టైగర్'గా మారుస్తానని అంటున్నాడు. అయితే ఈ విషయాన్ని తాను ఇప్పుడే ఖరారు చేయలేనని స్పష్టం చేస్తున్నాడు సంపత్. 'ఖుషి' చిత్రంలో పవన్ చెప్పిన 'ఐయామ్ రాయల్ బెంగాల్ టైగర్...సిద్ధూ సిద్ధార్థ రాయ్' అనే డైలాగ్ అప్పట్లో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

  'గబ్బర్ సింగ్-2' చిత్రం సరికొత్త కథతో చేస్తున్నామని చెప్పిన సంపత్......ఈ సినిమా గబ్బర్ సింగ్ చిత్రానికి ప్రీక్వెల్ గానీ, సీక్వెల్ గానీ కాదని స్పష్టం చేసాడు. జేమ్స్ బాండ్ సిరీస్ సినిమాలు దేనికది ఎలా ప్రత్యేకమో, గబ్బర్ సింగ్-2 చిత్రం కూడా ప్రత్యేకమైన కథతో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.

  English summary
  
 
 Pawan Kalyan is coming out with a sequel to smashing hit movie Gabbar Singh. As a part of this, many names have been tried to be kept as a suitable tittle for the upcoming sequel. After a lot of trial and error, the Tollywood sources say that the tittle ‘Bengal Tiger’ has been fixed. The character of Bengal Tiger was being worded in the earlier movie of Pawan, Khushi. Now the word is being used for the tittle of his upcoming movie. The movie will be directed by Sampath Nandi. It is heard that the director held discussions with Pawan Kalyan regarding the story and Pawan has agreed to it too. The shooting schedule of this movie would begin from the coming August onwards.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more