»   » అందుకే గౌతమి బ్రేకప్: కలత చెంది ఏకాంతంలోకి కమల్?

అందుకే గౌతమి బ్రేకప్: కలత చెంది ఏకాంతంలోకి కమల్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: చిత్రపరిశ్రమలో కమల్ హాసన్, గౌతమిల బ్రేకప్ తీవ్ర సంచలనమే కలిగించింది. వీరిద్దరు విడిపోవడానికి గల కారణాలపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, అసలు కారణమేమిటనేది గౌతమి చెప్పలేదు. ఈ బ్రేకప్‌పై మాట్లాడడానికి కమల్ హాసన్ ఇష్టపడడం లేదు. దాన్ని బట్టి ఆయన ఈ బ్రేకప్‌ను జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.

కమల్ హాసన్ కోసమే గౌతమి ఆ నిర్ణయం తీసుకుందనే ప్రచారం ముందుకు వచ్చింది. 'శభాష్ నాయుడు' చిత్ర షూటింగ్ సందర్భంగా శృతిహాసన్‌తో ఏర్పడిన వివాదాల కారణంగానే గౌతమి ఈ నిర్ణయం తీసుకుందనే వార్తలు వచ్చాయి.

Shruthi-kamal-Gautami

అయితే, ఆ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదని శ్రుతి హాసన్ కొట్టి పారేశారు. వారి బ్రేకప్‌నకు తాను కారణం కాదని ఆమె చెప్పారు. అయినా, ఆమె చుట్టే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొంతకాలంగా గౌతమి విషయంలో తండ్రి కమల్‌హాసన్‌తో శృతి హాసన్ విభేదిస్తున్నట్లు తమిళ చిత్ర పరిశ్రమలో ప్రచారం సాగుతోంది. అంతేకాక, గౌతమితో సంబంధం గురించి తండ్రిపై శృతి హాసన్ ఒత్తిడి పెంచిందని గుసగుసలు వనిపిస్తున్నాయి.

దాంతో ఏం చేయాలో అర్థం కాక కమల్ చాలా బాధపడినట్లు తెలుస్తోంది. కమల్ పడుతున్న తీవ్ర మానసిక ఒత్తిడిని గమనించి, వీలైనంత త్వరలో దీనికి పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో గౌతమి కమల్‌హాసన్‌తో విడిపోవడానికి సిద్ధమైందని అంటున్నారు.

గౌతమి నిర్ణయంతో కమల్ హాసన్ తీవ్ర వేదనకు, దిగ్భ్రాంతికి గురైనట్లు కూడా చెబుుతున్నారు. కొద్ది రోజుల క్రితం కథలు వినిపించడానికి చాలామంది దర్శకులకు ఇచ్చిన అపాయింట్‌మెంట్లను రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆయన ఏకాంతంలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. కమల్ హాసన్‌పై గౌరవంతో, ఆయనకు సమస్య కాకూడదనే ఉద్దేశంతో గౌతమి ఆ నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి.

English summary
It is said that Gautami has taken decission to reduce the pressure of Kamal Hassan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu