»   » ఎన్టీఆర్, చిరు కోసం దేవి ? బాలయ్య ఇగో దెబ్బ తిందా?

ఎన్టీఆర్, చిరు కోసం దేవి ? బాలయ్య ఇగో దెబ్బ తిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి' చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ని టీమ్ లోకి తీసుకున్నారు. అయితే రకరకాల కారణాలతో దేవి ఆ ప్రాజెక్టునుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఆ సినిమాకు సంగీతాన్ని కంచెకు సంగీతం అందించిన చింతన్ భట్ అందిస్తున్నారు. అయితే ఈ విషయం ఇక్కడ వరకూ బాగానే ఉన్నా బాలకృష్ణ ఇగో దెబ్బతిందని వినిపిస్తోంది.

తను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వందో చిత్రం కు సమయం లేదని ప్రాజెక్టు నుంచి బయిటకువెళ్లి, అటు జూ.ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కు, ఇటు చిరంజీవి 150 వ చిత్రానికి దేవి సంగీతం అందిస్తూడటం ఆయనకు కోపం తెప్పిస్తోందిట. తనతో మాట్లాడి అవసరం అనుకునే కొంత సమయం తీసుకుని ప్రాజెక్టుని చేయవచ్చు కదా అని ఆయన తన దగ్గరవారితో చెప్పి బాధపడినట్లుతెలుస్తోంది.

రీసెంట్ గా దేవి ఈ ప్రాజెక్టు నుంచి బయిటకు వచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ వేరే సంగీత దర్శకుడుని ఈ ప్రాజెక్టు కోసం వెతుకుతున్నట్లు సమాచారం. ఇళయరాజాని ఈ ప్రాజెక్టు కోసం అడిగే అవకాసం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అలాగే కీరవాణిని కూడా సంప్రదిస్తున్నట్లు చెప్తున్నారు. ఏం జరిగింది, దేవి తప్పుకోవటానికి గల కారణాలు స్లైడ్ షో లో చదవవచ్చు.

ఇక బాల‌కృష్ణ చేస్తున్న 100వ సినిమా కావ‌డంతో 'గౌతమీపుత్ర శాతకర్ణి'పై అభిమానుల్లోనే కాదు, సినీ వ‌ర్గాల్లోనూ అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. చారిత్రాత్మ‌క నేప‌థ్యం ఉన్న అంశం కావ‌డంతో ఈ సినిమాపై మొద‌ట్నుంచీ ప్ర‌తి ఒక్క‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఇటీవ‌లే ఈ చిత్రానికి హీరోయిన్‌గా శ్రేయ‌ను ఎంపిక చేయ‌గా ప్ర‌స్తుతం సినిమా 2వ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని 3వ షెడ్యూల్‌కు సిద్ధంగా ఉంది.

మొరాకో దేశంలో 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి'కి సంబంధించిన ప‌లు యుద్ధ సన్నివేశాల‌ను ఇటీవ‌లే చిత్రీక‌రించ‌గా అందులో తీసిన ప‌లు స్టిల్స్‌నే ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌గా విడుద‌ల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై జాగ‌ర్ల‌మూడి సాయిబాబా, రాజీవ్ రెడ్డిలు నిర్మిస్తున్నారు.

అయితే ఏం జరిగింది...

అదే సమస్య

అదే సమస్య

దేవిశ్రీప్రసాద్ లీజర్ గా టైమ్ తీసుకుని ట్యూన్స్ ఇస్తూంటారు. దాంతో కాస్త టైం ఎక్కువ పడుతుంది.

కానీ..

కానీ..

దర్శకుడు క్రిష్ మాత్రం ఈ సినిమాను ఎట్టిపరిస్దితుల్లో అనుకున్న తేదీకి అంటే సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

హిస్టారికల్ మూవి

హిస్టారికల్ మూవి

మరో ప్రక్క ఈ చిత్రం రెగ్యులర్ కమర్షియల్ చిత్రం కాకపోవటంతో హిస్టారికల్ చిత్రం అవటంతో మరితం సమయం కావాలని దేవి అడిగాడట

కమిట్ మెంట్స్

కమిట్ మెంట్స్

దానికి తోడు దేవిశ్రీప్రసాద్ ఎన్టీఆర్‌ 'జనతా గ్యారేజీ', చిరంజీవి 150వ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. వాటి బిజీలోనూ ఆయన ఉన్నారు.

మ్యూచువల్ గానే..

మ్యూచువల్ గానే..

దేవి,క్రిష్ కలిసి మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తోనే ఈ ప్రాజెక్టు విషయమై విడిపోదామని నిర్ణయించుకున్నారట.

దేవినే కావాలనుకుంటే

దేవినే కావాలనుకుంటే

దేవిశ్రీప్రసాద్ నే ఈ ప్రాజెక్టులో కంటిన్యూ చెయ్యాలంటే...రిలీజ్ డేట్ ని ఖచ్చితంగా మరో రెండు నెలలు ముందుకు జరపాలాల్సిన పరిస్దితి వస్తుంది

ఆ క్రేజే వేరు

ఆ క్రేజే వేరు

అయితే దేవిశ్రీప్రసాద్ ఈ ప్రాజెక్టుకు మ్యూజిక్ ఇస్తే వస్తే క్రేజే వేరు అంటున్నారు. మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పున్నారు.

ఎవిరినో

ఎవిరినో

ఈ నేపధ్యంలో ఈ భారి ప్రాజెక్టు ఎవరిని వరిస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కీరవాణి లేదా ఇళయరాజా ఎవరు సీన్ లోకి వస్తారో చూడాలి.

English summary
Devi Sri Prasad is no longer part of Nandamuri Balakrishna's 'Gauthamiputra Satakarni'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu