»   »  ప్రేమలో పడలేదు:జెనీలియా

ప్రేమలో పడలేదు:జెనీలియా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Genelia
జెనీలియా బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్(మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడు), నటి జెనీలియా డిసైజా ప్రేమలో పడినట్టు బాలీవుడ్ మీడియా వర్గాల్లో పుకిర్లు షికార్లు చేస్తున్నాయి. అయితే జెనీలియా మాత్రం ఈ పుకార్లను కొట్టిపారేసింది. రితేష్, తాను జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని...ప్రస్తుతం తాను ఒంటరినేనని స్పష్టంచేసింది.

తరచూ తాము కలుసుకొంటూ ఉంటామని...అయితే ఇది కేవలం స్నేహపూర్వకమైనదిగా చెప్పింది. తమ ఇద్దరి మధ్య వేరే ఏ సంబంధమూ లేదని స్పష్టంచేసింది. రితేష్‌తో కలిసి రెండు సినిమాలు చేసినందుకే ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారంది. తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులను మెప్పించిన జెనీలియా ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X