»   » రాణా-జెనీలియా చనువు...ఏంటి కథ?

రాణా-జెనీలియా చనువు...ఏంటి కథ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచి శరీర సౌష్టవం, ఆకట్టుకునే రూపం ఉన్న దగ్గుపాటి రాణా....తెలుగులో ఒక్క సినిమాతోనే బాలీవుడ్ ఛాన్స్ దక్కించుకున్నాడు. అఫ్‌కోర్స్ బాలీవుడ్ అవకాశం వెనక రాణా టాలెంట్‌తో పాటు...తాత డి రామానాయుడు ఇన్ ఫ్లూయెన్స్ కూడా ఉందనుకుకోండి. ప్రస్తుతం రాణా తెలుగులో జనీలియాతో జత కట్టి 'నా ఇష్టం" అనే మూవీలో నటిస్తున్నాడు. కలిసి పని చేస్తున్న ఈ ఇద్దరి మధ్య ఇప్పడు చనువు బాగా పెరిగి పోయిందట. దీంతో ఇద్దరి మధ్య 'సం"బంధం స్టార్ట్ అవుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రాణా-జనీలియా మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. తమ మధ్య మంచి స్నేహ బంధమే తప్ప మరే బంధం లేదని స్పష్టం చేస్తున్నారు.

రాణా తెరంగ్రేటం చేసిన తర్వాత అతనికి హీరోయిన్లతో లింకు అంటగడుతూ వార్తలు రావడం ఇది రెండో సారి. ఆ మధ్య 'దమ్ మారో దమ్" సినిమాలో హాట్ లేడీ బిపాసతో కలిసి రొమాంటిక్ గా నటించిన రాణాకు...ఆమెతో ఎఫైర్ అంటగడుతూ వార్తలొచ్చాయి. ఇప్పడేమో జనీలియాతో...

దగ్గబాటి హీరో సంగతి పక్కన పెడితే...జెనీలియా త్వరలో తన సహచర నటుడు, మహారాష్ట్ర మాజీ సీఎం కుమారుడైన రిఃథేష్ దేశ్‌ముఖ్ ను వచ్చ ఏడాదికి పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అవుతోంది. మరి జనీలీయా-రాణా దోస్తీపై రిథేష్ ఎలా స్పందిస్తాడో..?

English summary
Southern hottie-turned-B-Town boy Rana Daggubati and Genelia D'Souza, who are shooting for their movie Naa Ishtam, seem to have developed quite a soft spot for each other.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu