Just In
- 9 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 10 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 11 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 12 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఘట్టమనేని ‘మనం’: ఒకే ఫ్రేమ్‌లో సూపర్ స్టార్ కుటుంబం.. స్పెషల్ అట్రాక్షన్‌గా సితార ఎంట్రీ.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో 'మనం' లాంటి సినిమా రాబోతుందా.? అప్పుడు అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించినట్లే.. ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం కూడా ఒకే సినిమాలో కనిపించనుందా.? సూపర్ స్టార్ మహేశ్ బాబు కోరికపై ఓ స్టార్ డైరెక్టర్ దానికి అనుగుణంగా కథను రెడీ చేస్తున్నాడా.? అంటే దాదాపుగా అవును అన్న ప్రచారమే జరుగుతోంది. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇంతకీ ఈ సినిమాను తెరకెక్కించబోయే దర్శకుడు ఎవరు.? పూర్తి వివరాల్లోకి వెళితే...

ఫ్యామిలీ అంతా కలిసింది.. సక్సెస్ అయింది
అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాల హీరోలు నాగేశ్వర్రావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం ‘మనం'. వీరితో పాటు ఇందులో అమల, అఖిల్ కూడా నటించారు. పునర్జన్మల నేపథ్యంలో 2014లో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అలాగే, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. అంతేకాదు, అక్కినేని ఫ్యామిలీకి ఎప్పటికీ గుర్తిండిపోయింది.

అన్ని సినీ ఫ్యామిలీలు ఇదే పనిలో పడ్డాయి
‘మనం' సూపర్ హిట్ అవడంతో అదే తరహా సినిమా చేయాలని ఇండస్ట్రీలోని చాలా ఫ్యామిలీలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో ముఖ్యంగా నందమూరి, మెగా, ఘట్టమనేని, దగ్గుబాటి ఫ్యామిలీలు కథలు కూడా రెడీ చేయించుకుంటున్నాయని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. దీంతో ఆయా కుటుంబాల అభిమానుల్లో ఆసక్తి కూడా పెరిగిపోయింది.

టాలీవుడ్‌లో మరో మనం రాబోతుంది
టాలీవుడ్‌లో మరో మనం లాంటి సినిమా రాబోతుందని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతోంది. అప్పుడు అక్కినేని ఫ్యామిలీలోని నటులంతా కలిసి చేసినట్లు.. ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం కూడా కలిసి సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ కుటుంబానికి చెందిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఒకే ఫ్రేమ్‌లో సూపర్ స్టార్ కుటుంబం
మహేశ్ బాబు - వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలోనే ఘట్టమనేని కుటుంబంలోని నటులంతా కలిసి నటించబోతున్నారని తాజాగా ఓ వార్త లీకైంది. మహేశ్ బాబు హీరోగా చేస్తున్న ఈ మూవీలో కృష్ణ, గౌతమ్ (మహేశ్ కొడుకు) కూడా కీలక పాత్రలు చేస్తున్నారట. అలాగే, నమ్రత శిరోద్కర్ అతిథి పాత్రలో మెరవబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

స్పెషల్ అట్రాక్షన్‌గా సితార ఎంట్రీ.!
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తయిందని తెలిసింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సితార (మహేశ్ కూతురు) ఎంట్రీ అదిరిపోయే రేంజ్‌లో ఉంటుందట. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయిన సితార కోసం స్పెషల్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాడట చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి.

హిట్ కొట్టాడు.. ఎంజాయ్ చేస్తున్నాడు
మహేశ్ బాబు ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. దీంతో ఫుల్ ఖుషీగా ఉన్న మహేశ్.. ఆ వెంటనే ఫ్యామిలీతో కలిసి ఫారెన్‌లో పర్యటిస్తున్నాడు. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.