Don't Miss!
- News
మాజీ హోంమంత్రి సుచరిత డ్రైవర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య
- Automobiles
బుకింగ్ ప్రైస్ పెరిగిన జోరు తగ్గని బుకింగ్స్: అట్లుంటది Maruti Jimny అంటే..
- Sports
KL Rahul : కేఎల్ రాహుల్ పెళ్లిపై స్పందించిన టీంమేట్స్!
- Finance
pm kisan: రైతులకు మోడీ సర్కారు శుభవార్త.. కోట్లాది మందికి ప్రయోజనం
- Lifestyle
Today Rasi Palalu 24 January 2023: ఈ రోజు మిథున రాశి వారికి శుభవార్తలు, ఆర్థిక పరిస్థి గొప్ప మెరుగుదల
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ రోజే డబుల్ ధమాకా!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అవి రెండు కూడా మల్టీ స్టార్ సినిమాలు కావడం విశేషం. మొదట రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన RRR సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తర్వాత తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో చేసినటువంటి ఆచార్య సినిమా తో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఆ సినిమా మాత్రం ఆశించినంత స్థాయిలో సక్సెస్ కాలేదు. తీవ్రంగా నిరాశపరిచింది.
అయినప్పటికీ కూడా రామ్ చరణ్ తదుపరి సినిమాలపై అంచనాలు ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం అతను శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఆ ప్రాజెక్టుకు సంబంధించిన గాసిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు. డ్యూయల్ రోల్ అని టాక్ వస్తోంది. ఇప్పటికే కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

అయితే RC15 వ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ఫ్యాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లు విడుదల చేశారు. అయితే రామ్ చరణ్ సంబంధించిన మరొక స్పెషల్ మోషన్ పోస్టర్ కూడా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్టుకు తెలుస్తోంది.
మార్చి 27వ తేదీన రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా శంకర్ RC 15 కు సంబంధించిన ఒక పవర్ఫుల్ పోస్టర్ తో పాటు ఒక మేకింగ్ వీడియోను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా రామ్ చరణ్ కు సంబంధించిన మరొక సరికొత్త ప్రాజెక్టుపై కూడా అధికారికంగా క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక ఇప్పటికే రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కాబోతోంది.