»   » 'పోకిరి' రీమేక్ టైటిల్ తో గోపీచంద్ కొత్త చిత్రం

'పోకిరి' రీమేక్ టైటిల్ తో గోపీచంద్ కొత్త చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

సల్మాన్ ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్ లో పోకిరి రీమేక్ గా వచ్చిన వాంటెడ్ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ టైటిల్ ని పెడితే తనకూ హిట్ ఖాయమనుకున్నాడో ఏమో కానీ గోపీచంద్ ఈ టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు. రచయితనుంచి దర్శకుడుగా మారుతున్న బి.వి.యస్.రవి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఈ టైటిల్ యాప్ట్ గా ఉంటుందని నిర్మాత చెప్తున్నారు. ఈ చిత్రాన్ని గతంలో గోపీచంద్ తో శౌర్యం చిత్రం నిర్మించిన భవ్య క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ టైటిల్ విషయమై భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ ...హీరోకి హీరోయిన్ వాండెట్. విలన్ కి హీరో వాంటెడ్. కాబట్టే స్క్రిప్టు ప్రకారం ఈ టైటిల్ యాప్ట్ అని తలిచాం అన్నారు. ఇక ఈ చిత్రం మూడు పాటలు మినహా షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఈ నెల ఇరవై మూడు నుంచి పాటల కోసం ఇటలీ, దుబాయి వెళ్ళబోతున్నాం అన్నారు. చక్రి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా వేదం ఫేమ్ దీక్షాసేధ్ హీరోయిన్ గా చేస్తోంది. ఇక దర్శకుడు బి.వియస్ రవి గతంలో కళ్యాణ రామ్ జయీభవ, విష్ణువర్దన్ సలీం, ఝమ్మంది నాదం వంటి చిత్రాలకి కథ, మాటలు అందించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu