»   » ఆ రైటర్ డైరక్షన్ లో గోపీచంద్ చిత్రం కన్ఫర్మ్

ఆ రైటర్ డైరక్షన్ లో గోపీచంద్ చిత్రం కన్ఫర్మ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కళ్యాణ రామ్ జయీభవ చిత్రానికి కథ, మాటలు అందించిన రచయిత బి.వి.యస్ రవి దర్శకత్వంలో గోపీచంద్ చిత్రం చేయాటానికి కమిటయ్యారు. శౌర్యం చిత్రం నిర్మించిన భవ్య క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గోపీచంద్ కి రవి నేరేట్ చేసిన పద్దతి నచ్చటంతో ఈ కథను నువ్వే డైరక్ట్ చేయమని ప్రోత్సహించినట్లుగా తెలుస్తోంది. ఇక బి.వియస్ రవి ఇంతకుముందు సత్యం, మున్నా, పరుగు, కింగ్ చిత్రాలుకు మాటలు రాసారు. అలాగే మోహన్ బాబు నిర్మించిన సలీంకు కథా సహకారం అందించారు. అలాగే రవి పోసాని కృష్ణ మురళి వద్ద అశోసియేట్ రచయితగా శివయ్య, సీతారామరాజు, ప్రేయసి రావే, స్నేహితులు, అయోధ్య రామయ్య, భద్రాచలం వంటి చిత్రాలుకు పనిచేసారు. ఇన్నాళ్ళు మాటల రచయితగా పేరుతెచ్చుకున్న రవి దర్శకుడుగానూ సక్సెస్ కావాలని కోరుకుందాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu