Deepika Padukone: దీపిక పదుకోన్ అవుట్.. కల్కి 2 లోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దీపిక పదుకోన్ వ్యవహారం సెన్సేషనల్‌గా మారింది. కల్కి 2898 AD సీక్వెల్ నుంచి ఆమెను తప్పించినట్టు అధికారికంగా ప్రకటించడంతో జాతీయ మీడియాతోపాటు ప్రాంతీయ భాషల్లో ఈ వార్త ట్రెండింగ్‌గా మారింది. దీపిక పదుకోన్ డిమాండ్లు, గొంతెమ్మ కోరికలంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే కల్కి నిర్మాతలు అధికారికంగా ఆమె తమతో ట్రావెల్ కావడం లేదని అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆమె స్థానంలో ఎవరిని ఎన్నుకొన్నారనే విషయంప చర్చ జరుగుతున్నది. దీపిక పదుకోన్ వివాదాస్పద అంశం గురించిన వివరాల్లోకి.. ఆమె స్థానంలో మరో హీరోయిన్ గురించిన వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న దీపిక పదుకోన్ ఇటీవల కాలంలో తరుచూ వివాదాల్లో కనిపిస్తున్నారు. తాజాగా ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న స్పిరిట్ మూవీలో మొదట దీపికను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఆమెతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే ఆ సినిమా నిర్మాతలకు తలకు మించిన భారమయ్యే డిమాండ్లు పెట్టడంతో ఆమెను ఆ సినిమాను నుంచి తప్పించారు. స్పిరిట్ నిర్మాతను 25 కోట్ల రెమ్యునరేషన్, బిజినెస్‌లో వాటా, 25 మంది స్టాఫ్‌కు ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలు, అలాగే రోజుకు 7 గంటలే పనిచేస్తానని డిమాండ్లు విధించింది. అందుకే ఆమెను తీసేసారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వినిపించాయి.

అయితే స్పిరిట్ విషయంలో దీపిక పదుకోన్ వ్యవహరించిన తీరు అత్యంత చర్చనీయాంశమైంది. అయితే దాంతో కల్కి మూవీ కూడా ప్రభాస్ సినిమా కావడంతో ఆమెను తప్పిస్తారంటూ రూమర్లు వినిపించాయి. ఆ రూమర్లకు బలం చేకూరేలా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటనను జారీ చేసింది. కల్కి 2 సీక్వెల్‌లో ఆమెతో కొనసాగడం లేదు. మా సినిమాలో నటించాలంటే.. కమిట్‌మెంట్ ఉండాలి. అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. అందుకే మేము ఆమెతో భాగస్వామ్యం కావడం లేదు అనే విషయాన్ని ట్వీట్‌లో ప్రస్తావించారు.
అయితే కల్కి 2 నుంచి దీపికను తీసి వేయడం వెనుక అసలు కారణం.. గతంలో అమోధించిన రెమ్యునరేషన్ కంటే 25 శాతం అధికంగా పారితోషికం డిమాండ్ చేసింది. అలాగే రెవెన్యూలో వాటా ఇవ్వాలని కోరింది. ఈ సినిమా కోసం 5 గంటలనే పనిచేస్తానని చెప్పింది. దాంతో ఆమె డిమాండ్లకు తలవొగ్గని నిర్మాతలు గుడ్‌బై చెప్పారనే వార్త జాతీయ మీడియాలో వైరల్ అయింది.
ఇదిలా ఉంటే... దీపిక పదుకోన్ స్థానంలో ఇటీవల కాలంలో పాన్ ఇండియా వైడ్ సినిమాలతో వరుస విజయాలు సొంతం చేసుకొన్న స్టార్ హీరోయిన్‌ను ఫైనల్ చేశారు. ఆ స్టార్ నటి ఎవరో కాదు.. రష్మిక మందన్న అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల యానిమల్, ఛావా, పుష్ప 2 చిత్రాలతో భారీ విజయాలను అందుకొన్నది. అయితే దక్షిణాది నుంచి, బాలీవుడ్ నుంచి మరికొంత మంది హీరోయిన్లను కూడా పరిశీలించారు అనే విషయం మీడియాలో ప్రచారం జరుగుతున్నది.
ఇదిలా ఉంటే.. దీపిక పదుకోన్ కెరీర్ విషయానికి వస్తే.. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలోను, అలాగే బాలీవుడ్ చిత్రం రామాయణ్ సినిమాలో కూడా నటిస్తున్నారు. రామాయణ్ సినిమా కోసమే కల్కి 2 సినిమాను వదులుకొనేందుకు ప్లాన్ చేసిందనే రూమర్ కూడా మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.


Click it and Unblock the Notifications











