»   »  ఈ నెల 17 న కడుపుబ్బా నవ్వుకోవచ్చు

ఈ నెల 17 న కడుపుబ్బా నవ్వుకోవచ్చు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : వైవిధ్య భరిత చిత్రాల చిరునామా గుణ్ణం గంగరాజు తమ జస్ట్ ఎల్లో మీడియా ప్రై. లిమిటెడ్ తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'అమృతం చందమామలో'.అవసరాల శ్రీనివాస్, హరీష్ కోయలగుండ్ల, వాసు ఇంటూరి, శివన్నారాయణ, ధన్య, సుచిత్ర కీలక పాత్రధారులు గా కనిపించే ఈ చిత్రం మే 17 న గ్రాండ్ గా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. మన దేశంలో మొదటి స్పేస్ మూవీగా రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచానేలే ఉన్నాయి. ఈ చిత్రం టైటిల్ విన్నప్పుడు నుంచీ సినిమా కథేమిటి, ఈ సారి గుణ్ణం గంగరాజు ఏ విధమైన నవ్వులు సిద్దం చేసారు అనే ఆలోచన అందరిలో మెదిలింది. అదే ఓపినింగ్స్ తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు.

  ఈ చిత్రం స్టోరీ లైన్ గురించి గుణ్ణం గంగరాజు మాట్లాడుతూ... ''ఇతర దేశాల్లో వ్యాపారం పెట్టాలని చాలామంది కోరుకుంటారు. కానీ మా సినిమాలోని ప్రధాన పాత్రలు దానికి భిన్నంగా ఆలోచిస్తాయి. అసలు ఈ భూమి మీదే కాకుండా చందమామ మీద వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన చేస్తారు. దానికి రూపమే ఈ సినిమా. చంద్రమండలంపై నడిచే కథ ఇది. అక్కడ ఓ హోటల్‌ పెట్టాలనుకొని బయల్దేరిన ఓ బృందానికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయన్నదే చిత్రం.'' అని చెప్పారు.

   Gunnam Ganga Raju's Amrutham Chandamamalo announces its release

  అలాగే... ''బుల్లితెరపై విజయవంతమైన ధారావాహిక.. అమృతం. దానికి కొనసాగింపుగా మరొకటి ఎందుకు తీయకూడదు అని చాలా మంది అడిగారు. అప్పుడే 'అమృతం... చందమామలో' ఆలోచన వచ్చింది. ఇవే పాత్రల్ని వెండితెరపైకి తీసుకెళితే పరిధి పెరుగుతుంది కదా అని కథ రాయడం మొదలుపెట్టా. ఇందులో 60 నిమిషాల పాటు గ్రాఫిక్స్‌ ఉంటాయి. కామెడీ మాత్రం చవకగా ఎందుకుండాలి? అందుకే భారీగా సెట్స్‌వేసి చిత్రాన్ని తీర్చిదిద్దాం. అందరికీ నచ్చుతుందనే నమ్మకముంది'' అన్నారు.

  ఇక "అమృతం సీరియల్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. ఆరేళ్లపాటు వారానికి ఒకసారి నిర్విరామంగా ఆ సీరియల్‌ను ప్రసారం చేశాం. ఇప్పుడు రీ టెలికాస్ట్ అవుతోంది. అంటే దాదాపు 12 ఏళ్లుగా ఆ సీరియల్‌ను చూస్త్తూనే ఉన్నారు. 300 ఎపిసోడ్లకు పైగానే చేశాం. అంతకన్నా ఏం చేస్తామనుకుని ఆపేశాం. 'అమృతం'ను ఎక్కడైతే ఆపామో, అక్కడే 'అమృతం చందమామలో' సినిమాను మొదలుపెట్టాం. ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగుతుంది. చమత్కారాలుంటాయి. ఆరు నెలలు కథ కోసం కసరత్తులు చేశాం.

  ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడు రసూల్ హీరో అయితే, గ్రాఫిక్స్ హీరోయిన్ అవుతాయి. చాలా ఖర్చు పెట్టి ప్రపంచంలోనే ఈ తరహా సినిమాల్లో ఇది గొప్పగా ఉండాలని తెరకెక్కించాం. స్టార్టింగ్ టైటిల్స్ నుంచి ఎండింగ్ టైటిల్స్ వరకు అన్నీ ఈ సినిమాలో హైలైట్లే. చాలా రిస్క్ చేసి ఈ ప్రాజెక్ట్‌ను చేశాం. ఈ సినిమాకు సీక్వెల్స్ చేసే ఆలోచనల్లోనూ ఉన్నాం. 'అమృతం కంచుకోటలో' అనే కథ మైండ్‌లో ఉంది. ఈ నెల్లోనే 'అమృతం చందమామలో'ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.

  చంద్రమోహన్, ఆహుతి ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, కృష్ణ భగవాన్, రావు రమేష్, అశోక్ కుమార్ ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: గంగరాజు గుణ్ణం, వాసు ఇంటూరి, పాటలు: అనంతశ్రీరామ్, నృత్యాలు: విజయ్, ఫైట్స్: కింగ్ సాలమన్, ఆర్ట్: జె.కె.మూర్తి, సంగీతం: శ్రీ, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, కెమెరా: రసూల్ ఎల్లోర్, గ్రాఫిక్స్: ఈసీఎస్, లాఫింగ్ డాట్స్, నిర్మాత: ఊర్మిళ గుణ్ణం.

  English summary
  Gunnam Gangaraju who is turning his popular small screen serial Amrutam into Amrutam Chandamamalo on silver screen is planning to release his film on May 17th in a grand manner. Amrutham Chandamamalo is expected to be a laugh riot and Gunnam Gangaraju is extremely confident about the output.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more