»   » బాబు... హంసానందిని పై మోజు పడ్డాడు

బాబు... హంసానందిని పై మోజు పడ్డాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'మిర్చి' చిత్రం‌లో ఐటం భామ హంసా నందిని తన అందచందాలతో ఆకట్టుకుంది. సినిమాకు కీలకంగా మారిన అంశాల్లో ఈ పాట కూడా ఉందటం విశేషం...దాంతో ఆమె ఐటం సాంగ్ లకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఆమె ఐటం తమ చిత్రంలో చేసిందంటే సినిమా హిట్ అనే నమ్మకాలు దర్శక,హీరోలకు వచ్చేసాయి. దాంతో తాజాగా గోపీచంద్ తన చిత్రంలో ఆమె ఐటం సాంగ్ అడిగి మరీ పెట్టించుకున్నట్లు సినీ వర్గాల సమాచారం. సర్లే ఎలాగో తీసుకుంటున్నాం కదా అని ...కేవలం ఐటం సాంగ్ కే పరిమితం చేయకుండా ఆ చిత్రంలో ఓ కీలకమైన పాత్రను ఆమె చేత దర్శకుడు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

గోపీచంద్‌ హీరోగా భవ్య క్రియేషన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాత. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తారు. నిర్మాత మాట్లాడుతూ ''కథాబలం ఉన్న చిత్రమిది. గోపీచంద్‌ సినిమా అంటే.. ఎలాంటి అంశాలు ఉండాలని ఆశిస్తారో అవన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. అనూప్‌ సంగీతం అందిస్తున్నారు. 'శౌర్యం' తరవాత గోపీచంద్‌ చేస్తున్న పూర్తిస్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది'' అన్నారు.

Hamsa Nandini item song with Gopi Chand

దర్సకుడు శ్రీవాస్ మాట్లాడుతూ...''లక్ష్యంతో నా కెరీర్‌ ప్రారంభమైంది. దర్శకుడిగా నన్ను ప్రోత్సహించిన.. గోపీచంద్‌తో మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. తప్పకుండా అంచనాలను అందుకొనేలా ఉంటుందీ చిత్రం'' అన్నారు‌. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్‌ సీపాన, స్క్రీన్‌ ప్లే: కోన వెంకట్‌, గోపీమోహన్‌.

ఇక గోపీచంద్ వరసగా రెండు ప్రాజెక్టులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రాధాకృష్ణ కుమార్ అనే నూతన దర్శకుడుతో ఆయన సినిమా ప్రారంభించగానే...ఇక బి.గోపాల్ ఆయన అంతకు ముందు షూట్ చేసిన సినిమా పరిస్ధితి ఏమిటీ అంటున్నారు. ఎక్కడా గోపీచంద్ ఆ చిత్రం గురించి మాట్లాడటం లేదు. దాంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్లే అంటున్నారు. మరి ఆ నిర్మాతల పరిస్ధితి ఏమిటని,గోపీచంద్ ని నమ్ముకుని రెండు సార్లు డైరక్టర్ ని మార్చినా సినిమా ఫినిష్ చేయలేకపోయారు. దాంతో ఇప్పుడా నిర్మాతల గురించే అంతటా చర్చ జరుగుతోంది. ఫైనాన్స్ సమస్యలతో ఆగినట్లు చెప్తున్నా...సినిమా భూపతి పాండ్యన్ తో ప్రారభమైనప్పుడే పూర్తయితే ఈ సమస్య రాకపోను అంటున్నారు. అప్పుడు గోపీచంద్ ఇన్వాల్వమెంట్ తోనే ఆగిపోయిందని వినికిడి.

English summary
Gopichand and Srivas movie is on sets for some time now. Hamsa Nandini also going appear in an item song with Gopi Chand in the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu