Just In
- 12 min ago
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- 14 min ago
పొట్టి బట్టల్లో పిచ్చెక్కిస్తోంది.. నిహారికను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు!
- 45 min ago
RRR నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. డేట్ కూడా ఫిక్స్?
- 1 hr ago
గతం గురించి ఆలోచించకు.. అదిరిపోయిన ప్లే బ్యాక్ ట్రైలర్
Don't Miss!
- News
Same Sex marriage: మోడీ సర్కార్ నిర్ణయంపై భగ్గుమంటోన్న స్వలింగ సంపర్కులు: తొక్కేశారంటూ
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Sports
యువరాజ్ సింగ్ ట్వీట్‌పై దుమారం.. ఈ లెక్కన కోహ్లీ 200 సెంచరీలు చేసేవాడా?
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నెక్స్ట్ ఏంటి?.. డైలామాలో హరీష్ శంకర్
మాస్ పల్స్ తెలిసిన అతి కొద్ది మంది దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. కథ ఏదైనా సరే.. మాస్ మెచ్చేలా.. వారికి నచ్చేలా చిత్రీకరించడంలో హరీష్ శంకర్ స్టైలే వేరు. అందుకే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో ఓ రీమేక్ తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. తాజాగా వరుణ్ తేజ్‌తో కూడా ఓ రీమేక్ చేసి గద్దలకొండ గణేష్ అనే కొత్త అవతారాన్ని చూపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది.
ఇక్కడి వరకు అంతా బాగానే నడిచింది. గద్దలకొండ గణేష్ వచ్చింది.. హిట్ అయింది.. వెళ్లిపోయింది.. వరుణ్ తేజ్ కూడా కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. కానీ హరీష్ శంకర్ మాత్రం మరో సినిమాను పట్టాలెక్కించలేదు. స్టేజ్ ఎక్కితే చాలు.. ఏ హీరో ఎదురుగా ఉంటే ఆ హీరోను చాన్స్ అడగడం మాత్రం చేస్తుంటాడు. రీసెంట్‌గా రజినీ కాంత్‌ను సైతం అడిగేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

హరీష్ శంకర్ ప్రస్తుతం అక్కినేని హీరోలపై గురి పెట్టాడని తెలుస్తోంది. పెద్ద హీరోలెవరూ ఖాళీగా లేకపోవడంతో మధ్యలో ఓ సినిమాను కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కినేని హీరోలతో చర్చలు జరపాలని ప్రయత్నిస్తున్నాడని సమాచారం. అయితే నాగ చైతన్య వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో.. అఖిల్‌తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అఖిల్ చేతిలో ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ ప్రాజెక్ట్ మాత్రమే ఉంది.