»   »  హరీష్ శంకర్ ని ఖరారు చేస్తూ ప్రకటన

హరీష్ శంకర్ ని ఖరారు చేస్తూ ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu
Harish Shankar
హైదరాబాద్ : 'గబ్బర్‌సింగ్‌' చిత్రంతో ఘన విజయం సాధించిన హరీష్‌ శంకర్ మరోమారు అదే తరహా వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు ‌. 'సింహా' వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన పరుచూరి ప్రసాద్‌ నిర్మాణంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో మెగా కాంపౌండ్‌కి చెందిన సాయి ధరమ్ తేజ హీరోగా నటిస్తారు.

నిర్మాత మాట్లాడుతూ ''వినోదం, వాణిజ్య అంశాల్ని కలగలిపి హరీష్‌శంకర్‌ ఓ కథని సిద్ధం చేసుకున్నారు. ఆయన గత చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో వినోదం పండబోతోంది. త్వరలో పూర్తి వివరాల్ని ప్రకటిస్తాం'' అన్నారు.

ఇక చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ 'రేయ్‌'తో హీరోగా మారాడు. ఈ చిత్రం ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం 'పిల్లా నువ్వు లేని జీవితం' అనే చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఆయన మూడో చిత్రం కూడా ఖరారైనట్టు సమాచారం. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' పేరుతో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు సమాచారం. త్వరలోనే సాయి ధరమ్ తేజ హీరోగా తెలుపుతూ అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రం అందించిన హరీష్ శంకర్ వెను వెంటనే రామయ్యా వస్తావయ్యా అంటూ డిజాస్టర్ ఇచ్చారు. దాంతో ఆయన కంటిన్యూగా ప్రాజెక్టులు చేయాల్సిన హరీష్ ఖాళీ పడ్డారు. గతంలో రవి తేజ సుబ్రహ్మణ్యం పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వినపడ్డాయి. తర్వాత అల్లు అర్జున్ అనుకున్నారు. చివరకు సునీల్ పేరు కూడా బయిటకు వచ్చింది.అయితే అవేమీ మెటీరియలైజ్ కాలేదు. దాంతో ఇప్పుడు మార్కెట్లో క్రేజ్ గా ఉన్న సాయి ధరమ్ తేజ తో ఆయన చిత్రం మొదలెట్టారు. ఈ చిత్రంతో తప్పకుండా హిట్ కొడతాననే ధీమాగా ఉన్నారు హరీష్ శంకర్.

English summary
Megastar's nephew Sai Dharam Tej has lined up third film with a big director. Harish Shankar will be directing him. The Gabbar Singh director will be starting this film as his next for producer Parachuri Prasad. Buzz is that Subramanyam 4 Sale is the title under consideration for it. More details are awaited.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu