»   » హసన్ ఆలీ వివాదంలో రామ్ చరణ్ మగధీర గుర్రం?

హసన్ ఆలీ వివాదంలో రామ్ చరణ్ మగధీర గుర్రం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మగధీరలో చిత్రంలో రామ్‌చరణ్‌తేజ వాడిన గుర్రం ఇప్పుడు సినీ,రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. హఠాత్తుగా ఈ గుర్రం టాపిక్ ఏమిటా అంటే దానకి కారణం హసన్ అలీ వ్యవహారం. మగధీర సినిమాలో వాడిన గుర్రం హసన్ ఆలీకి సంబంధించి గుర్రపుశాల నుంచి తెచ్చినదేనని, ఇప్పటికీ ఆ గుర్రం చిలుకూరులోని చిరంజీవి ఫాంహౌస్‌లో ఉందని అంతటా వినపడుతోంది. అంతేగాక రామ్‌చరణ తేజ కూడా పూణేలోనే హసన్ ఆలీకి చెందిన రేస్‌కోర్టులోనే గుర్రపుస్వారీలో శిక్షణ పొందారని చెప్తున్నారు. అయితే అప్పటికీ హసన్‌ ఆలీకి ఈ చట్టవిరుద్ధమైన అంశాలకు సంబంధం ఉందన్న సంగతి తెలియకపోవచ్చునని చెప్తున్నారు. మరో ప్రక్క చిరంజీవికి హసన్ ఆలీతో సంబంధం ఉన్నా,లేకపోయినా తన వాంగ్మూలంలో రాజకీయాల్లోకి వచ్చిన సినీ హీరో అనగానే అందరి దృష్టి ఆయన మీదనే పడింది.దాంతో చిరంజీవి వెంటనే స్పందించి ఈ వార్తలను ఖండించారు.సినిమాలు తప్ప హసన్ ఆలీ ఎవరో తెలియదని ఇవాళ మీడియా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

English summary
Hasan Ali deposited in Swiss Bank money of ex-chief minister of Andhra Pradesh and two film actors and one actress. One of the film actors is presently active in politics.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu