HBD Yash.. కేజీఎఫ్ తర్వాత 400 కోట్లతో Yash19.. దర్శకుడు ఎవరంటే?

కేజీఎఫ్‌తో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన కన్నడ సూపర్ స్టార్ యష్ భారీ ప్రణాళికతో సిద్దమవుతున్నాడు. కేజీఎఫ్ తర్వాత ఆ స్థాయి సినిమా కథ కోసం వేచి చూస్తున్న ఆయన ప్రస్తుతం మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమా కథ, బడ్జెట్‌పై దక్షిణాది మీడియాలో వార్త వైరల్ అవుతున్నది. యష్ తన కెరీర్‌లో 19వ చిత్రం గురించిన వివరాల్లోకి వెళితే..

కరోనావైరస్‌ లాక్‌డౌన్‌కు ముందు కేజీఎఫ్ 1 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. అయితే అంచనాలు లేకుండా.. యష్ గురించి పెద్దగా తెలియని క్రమంలో ఆ సినిమా సంచలన విజయం సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దక్షిణాదిలో కంటే ఆ సినిమాకు ఉత్తరాదిలో భారీ కలెక్షన్లు నమోదయ్యాయి.

HBD Yash: KGF fame Yash19 with 400 crores budget by Tamil Director

కేజీఎఫ్ 1 చిత్రం విజయంతో కేజీఎఫ్2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 1000 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో యష్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. దాంతో ఆ స్థాయి సినిమా కోసం యష్ ఎక్కువగానే వెయిట్ చేశారు.

HBD Yash: KGF fame Yash19 with 400 crores budget by Tamil Director

కేజీఎఫ్ 2 సినిమా తర్వాత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు యష్ త్వరలోనే తియ్యని వార్త చెప్పే అవకాశం ఉంది. యష్ కెరీర్‌లో 19వ చిత్రంగా రూపుదిద్దుకొనే సినిమాను 400 కోట్లతో తెరకెక్కించనున్నారనే వార్త వైరల్ అయింది. ఈ సినిమాను తమిళ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నది. ఈ సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు డైరెక్షన్ చేయబోతున్నాడు. ఈ సినిమాను యష్ పుట్టిన రోజు జనవరి 8వ తేదీన గానీ, లేదా 15వ తేదీన గానీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X