twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఖిల్ ‘హలో’ మూవీకి షాక్: టీజర్ తొలగించిన యూట్యూబ్, కాపీ కొట్టారా?

    By Bojja Kumar
    |

    Recommended Video

    అఖిల్ ‘హలో’ మూవీకి షాక్.. టీజర్ తొలగించిన యూట్యూబ్

    అఖిల్ అక్కినేని నటించిన 'హలో' మూవీ వచ్చే నెల 22న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ దగ్గర పడుతున్న వేళ ఊహించని షాక్ తగిలింది. ఆ మధ్య విడుదలైన 'హలో' టీజర్‌ను యూట్యూబ్ తొలగించింది.

    ఈ చిత్రాన్ని స్వయంగా నాగార్జున నిర్మిస్తుండటంతో అన్నపూర్ణ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్‌లో దీన్ని అప్ లోడ్ చేశారు. ఈ టీజర్‌కు మిలియన్స్‌లో వ్యూస్, లక్షల్లో లైక్స్ వచ్చాయి. అయితే ఉన్నట్టుండి టీజర్ యూట్యూబ్ నుండి మాయం కావడంతో అభిమానులు షాకవుతున్నారు.

    కారణం ఏమిటి?

    కారణం ఏమిటి?

    ఈ టీజర్ తొలగించడానికి కారణం ఇందులో వాడిన మ్యూజిక్ అని తెలుస్తోంది. అది కాపీ రైట్ ఉన్న మ్యూజిక్ కావడం, దాని వినియోగ హక్కులు పొందకుండా టీజర్లో వాడేయటంతో పసిగట్టిన యూట్యూబ్ దాన్ని తొలగించింది.

    ఆ మ్యూజిక్ సొంత హక్కు దారులు వారే

    ఆ మ్యూజిక్ సొంత హక్కు దారులు వారే

    ఫిన్‌లాండ్‌కి చెందిన ఎపిక్ నార్త్ కంపెనీ టీజర్స్ కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ తయారు చేస్తుంది. ఎంతో క్వాలిటీగా ఉండే ఆ మ్యూజిక్‌ని చిత్ర సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ టీజర్‌కి వాడాడట. దీంతో కాపీరైట్ క్లైమ్ కావడంతో హలో టీజర్‌ని యూట్యూబ్ నుండి తీసేశారు.

    వెంటనే చర్యలు చేపట్టిన అన్నపూర్ణ స్టూడియోస్

    వెంటనే చర్యలు చేపట్టిన అన్నపూర్ణ స్టూడియోస్

    ఈ విషయం తెలిసిన వెంటనే అన్నపూర్ణ స్టూడియోస్ వారు చర్యలు చేపట్టారు. కాపీ రైట్ ఉన్న ఆ మ్యూజిక్ హక్కులు కొని.... తిరిగి టీజర్ అప్ లోడ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

    ఇది ఊహించని చేదు అనుభవమే

    ఇది ఊహించని చేదు అనుభవమే

    ‘హలో' చిత్ర యూనిట్‌కు ఇది ఊహించని చేదు అనుభవమే. సినిమా విడుదల ముందే ఇలా జరుగడంతో నాగార్జున కూడా అసంతృప్తికి గురైనట్లు సమాచారం.

    కొడుకు కెరీర్ కోసం కాంప్రమైజ్ కాని నాగార్జున

    కొడుకు కెరీర్ కోసం కాంప్రమైజ్ కాని నాగార్జున

    అఖిల్ నటించిన తొలి సినిమా భారీ ప్లాప్ కావడంతో నాగార్జున స్వయంగా రంగంలోకి దిగారు. చిత్ర నిర్మాణ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ‘మనం' సినిమాతో నాగార్జున ఫ్యామిలీకి మంచి హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 22న ‘హలో' మూవీ విడుదల కాబోతోంది.

    English summary
    The teaser of "Hello" was removed from Annapurna Studios YouTube channel. YouTube India has deactivated the teaser after it got millions of views and likes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X