మేనల్లుడి కోసం రంగంలోకి మహేష్.. రేపు ప్రకటించే టైటిల్ అదే!

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్- పద్మావతి దంపతుల కుమారుడు గల్లా అశోక్ హీరోగా లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన చాలా కాలం క్రితం అధికారికంగా ప్రకటించిన ఒక కమర్షియల్ మూవీతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. కరోన కారణంగా ఈ సినిమా ఇప్పటికే చాలా ఆలస్యం అవుతోంది. ఇక ఈ సినిమా టైటిల్, టీజర్‌ను మహేష్ బాబు రేపు లాంచ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

అయితే గల్లా అశోక్ నటించిన ఈ సినిమా టైటిల్ ఏమిటి అనే దాని మీద అప్పుడే న్యూస్ బయటకు వచ్చేసింది. టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాకి 'హీరో' అని టైటిల్ ఫిక్స్ చేశారు. రేపు మహేష్ రిలీజ్ చేయబోయే టైటిల్ టీజర్ ద్వారా ఇదే టైటిల్ ధృవీకరించబడుతుంది. 'హీరో' సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాని మహేష్ సోదరి, గల్లా అశోక్ తల్లి పద్మావతి గల్లా నిర్మించారు. ఈ సినిమాలో గల్లా అశోక్‌తో నిధి అగర్వాల్ జత కడుతున్నారు.

hero is the title for Mahesh Babu’s nephew galla ashoks debut film

అమరరాజా మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమా తెరకెక్కుతోంది. నిజానికి గల్లా అశోక్ హీరోగా ముందు దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక సినిమా ప్రారంభించారు. షూటింగ్ కూడా కొంత పూర్తయ్యాక ఎందుకో ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పట్లో సినిమా అవుట్ పుట్ నచ్చక మహేష్ బాబు ఈ సినిమాను ఆపేశారని ప్రచారం కూడా జరిగింది. కానీ అసలు ఏం జరిగింది అనే విషయం మాత్రం బయటకు వెల్లడి కాలేదు. ఇక ఈ సినిమా ఔట్ పుట్ విషయంలో మహేష్ బాబు చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X