»   »  డబ్బు ఇస్తేనే డబ్బింగ్: నిర్మాతకు హీరో రామ్ చుక్కలు?

డబ్బు ఇస్తేనే డబ్బింగ్: నిర్మాతకు హీరో రామ్ చుక్కలు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: డబ్బింగ్ పూర్తైతే ..సినిమాకు నటీనటులు చేసే వర్క్ దాదాపు కంప్లీట్ అయినట్లే. అందుకే హీరోలు, క్యారక్టర్ ఆర్టిస్టులు డబ్బింగ్ దగ్గరకి వచ్చేసిరకి తన డబ్బులు పూర్తిగా ఇస్తేనే డబ్బింగ్ చెప్తామని ట్విస్ట్ లు ఇస్తూంటారు. అలాంటిదే హీరో రామ్ చేసి,నిర్మాతకు చుక్కలు చూపిస్తున్నాడని మీడియా వర్గాల కథనం. వరస ఫ్లాపుల్లో ఉన్న హీరో కూడా ఇలా రెమ్యునేషన్ దగ్గర ఏడిపిస్తే సినిమాలు ఏం చేయగలం అని వాపోతున్నారు. గతంలోనూ కందీరీగ చిత్రం తర్వాత..బెల్లంకొండ సురేష్ తో రెమ్యునేషన్ విషయంలో గొడవ అయ్యి... ఫిల్మ్ ఛాంబర్ ద్వారా పరిష్కరించుకున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త వివాదం పూర్తి వివరాల్లోకి వెళితే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'పండగ చేస్కో' మూడు కోట్ల రెమ్యూనరేషన్ కు అంగీకరించిన రామ్... అందులో 2.5 కోట్ల ను ఇప్పటికే తీసేసుకున్నాడట. మిగిలిన యాభై లక్షలను విడుదల సమయంలో ఇస్తానని నిర్మాత చెబుతుంటే... ససేమిరా అంటూ... డబ్బిస్తేనే డబ్బింగ్ చెబుతానని రామ్ బీష్మించుకు కూర్చున్నాడని అంటున్నారు. రామ్ పెదనాన్న నిర్మాత స్రవంతి రవికిశోర్ కూడా ఈ విషయంలో కలగచేసుకోవటం లేదని అంటున్నారు.

అంతేకాదు... 'పండగ చేస్కో' నిర్మాత పరుచూరి కిరీటితో పాటు... స్రవంతి రవికిశోర్ సైతం కొత్తగా ఏర్పడిన నిర్మాతల సిండికేట్ లో భాగస్వాములే. అయినా నిర్మాతకు సహకరించని రామ్ కు పెదనాన్న స్రవంతి రవికిశోర్ సైతం నచ్చచెప్పే ప్రయత్నం చేయడం లేదని అంటున్నారు. .

అప్పటికీ ...దర్శకుడు మలినేని గోపీచంద్ తో ఉన్న పరిచయాలతో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మాత తమకు బాకీ ఉన్నా... సినిమా పూర్తి కావడానికి పెద్ద మనసుతో సహకరిస్తున్నట్లు సమాచారం.... కానీ హీరో రామ్ దగ్గరకు వచ్చే సరికీ మాత్రం ఒప్పుకోవటం లేదని అంటున్నారు.

తొలినుంచీ ఈ సినిమా రకరకాల కారణాలతో ఆగుతూ,మొదలవుతూ వస్తోంది. ఏ క్షణాన నిర్మాత పరుచూరి కిరీటి 'పండగ చేస్కో' సినిమా మొదలెట్టాడో కానీ... సినిమా కష్టాలన్నీ ఈ చిత్రానికే వచ్చి పడ్డాయని అంటున్నారు. అనివార్య కారణాల వల్ల నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరిగింది.

Hero Ram twist to Pandaga Chesko Producer

రామ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీలో భారీ తారాగణమే నటించింది. షెడ్యూల్స్ అప్ సెట్ కావడంతో... మళ్ళీ వీళ్ళందరి డేట్స్ ను ఎడ్జస్ట్ చేసి షూటింగ్ ముగించే సరికీ దర్శక నిర్మాతల తల ప్రాణం తోక్కి వచ్చింది. ఇప్పుడు హీరో రామ్ కారణంగా నిర్మాత కొత్త కష్టాలు ఎదుర్కొంటున్నట్టు సమాచారం.

చిత్రం వివరాల్లోకి వెళితే...

ఈ చిత్రంలో రామ్‌ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని, కుటుంబమంటే ప్రాణాలిచ్చే కుర్రాడిగా రామ్‌ 'పండగ చేస్కో' లో కనిపిస్తారని చెప్తున్నారు. అతని పాత్ర ఎన్నారై అని...చాలా ఉషారుగా ఇప్పటివరకూ రామ్ చెయ్యని విధంగా క్యారక్టర్ ని డిజైన్ చేసారని చెప్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక అతని ఇమేజ్ రెట్టింపు అవుతుందని, యూత్ లో క్రేజ్ మరింత పెరుగుతుందని హామీ ఇస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ... అతనొస్తే పండగలానే ఉంటుంది. దసరా, దీపావళి, సంక్రాంతి... ఇవన్నీ తనతో పాటు ఫ్యామిలీ ప్యాక్‌గా తీసుకొస్తాడు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఓ పెళ్లిలా మార్చేస్తాడు. ఆ జోరైన కుర్రాడి కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు గోపీచంద్‌ మలినేని. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పండగ చేస్కో'. రామ్‌ హీరో. రకుల్‌ప్రీత్‌సింగ్‌, సోనాల్‌చౌహాన్‌ హీరోయిన్. పరుచూరి కిరీటి నిర్మాత.

ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. రామ్‌, రకుల్‌, సోనాల్‌ తదితరులపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘ రామ్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు హీరో పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. పూర్తిస్థాయి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. తమన్‌ మంచి సంగీతాన్నిచ్చారు. యువతతో పాటు అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని చెప్పారు.

రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, సంపత్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెలకిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ; వెలిగొండ శ్రీనివాస్‌, మాటలు: కోన వెంకట్‌, రచన సహకారం: అనిల్‌ రావిపూడి, కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డ్యాన్స్‌: రాజు సుందరం.

English summary
'Pandaga Chesko' starring Ram and Rakul Preet Singh came up with a new twist to Producer Paruchuri Kiriti.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu