»   » తెలుసా?: ‘సరైనోడు’ కథ ని మొదట ఇద్దరు హీరోలు రిజెక్టు చేసారు

తెలుసా?: ‘సరైనోడు’ కథ ని మొదట ఇద్దరు హీరోలు రిజెక్టు చేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'సరైనోడు'. ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయ్యేదాకా పెద్దగా అంచనాలు లేవు. టీజర్ రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా ఎక్సపెక్టేషన్స్ పెరిగిపోయాయి. అయితే ఈ సినిమా కథని మొదట ఇద్దరు హీరోలు రిజెక్టు చేసారు. ఆ ఇద్దరు హీరోలు ఎవరూ తెలుసా...

అందుతున్న సమచారం ప్రకారం ఈ కథని మొదట రిజెక్టు చేసింది గోపిచంద్. వెంకటేష్ తో బోయపాటి శ్రీను తులసి చిత్రం చేసేటప్పుడు ఆయన గోపీచంద్ కుఈ కథని నేరేట్ చేసాడట. అయితే గోపిచంద్ కు ఈ కథ నచ్చక రిజెక్టు చేసాడని తెలుస్తోంది.

'సరైనోడు' లోకేషన్లో సందడే సందడి (ఫోటోస్)

అలాగే... లెజండ్ సూపర్ హిట్ తర్వాత రామ్ చరణ్ తో బోయపాటి శ్రీను సినిమా ప్లాన్ చేసారు. అందులో భాగంగా ఆయన ఈ కథను రామ్ చరణ్ కు నేరేట్ చేసారు. అయితే రామ్ చరణ్ కు ఈ కథ నచ్చలేదు. చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి విన్నారు. ఇద్దరకి ఎక్కలేదని వినికిడి.

ఆ తర్వాత ఈ కథతో అల్లు అర్జున్ ని కలిసి ఒప్పించాడు. అయితే చాలా కాలం గీతా ఆర్ట్స్ లో సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. స్క్రిప్టు పూర్తి వెర్షన్ రకరకాల మార్పులతో జరిగింది. అంటే వాళ్లిద్దరూ ఆ మార్పులు చేసే ఆసక్తి చూపలేదు. బన్నీ మాత్రం అదే స్టోరీ లైన్ కు తనదైన శైలిలో మార్పలు చేసి హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడన్నమాట.

 Heroes who Rejected ‘Sarrainodu’


ప్రస్తుతం సినిమా యూనిట్ ఓ మెలొడీ సాంగ్ చిత్రీకరణలో భాగంగా బొలీవియా దేశం వెళ్లారు. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ ఫ్లాట్ పాం ద్వారా ఓ ఫోటో రీలీజ్ చేసారు.

ఇటీవల విడుదలైన సరైనోడు ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్లో బన్నీ పెర్ఫార్మెన్స్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

'ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాననుకున్నావేమో...మాస్ ఊరమాస్' అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ అభిమానులకు తెగనచ్చేసింది.

లుక్ పరంగా కూడా బన్నీ గత సినిమాలకంటే భిన్నంగా....మాస్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. తెలుగు హీరోలు.. లవ్ స్టోరీలు టీజర్ విడుదల తర్వాత పబ్లిసిటీ ఉధృతం చేసారు.

వాలెంటైన్స్ స్పెషల్ : తెలుగు హీరోలు.. లవ్ స్టోరీలు

ఏపీ, తెలంగాణ, బెంగుళూరు ఏరియాల్లో ఉన్న దాదాపు 1000 థియేటర్లలో ఈ టీజర్ ప్రస్తుతం ప్రతి రోజూ ప్రదర్శితం అవుతోంది. టీజర్ విషయంలోనే అల్లు అరవింద్ ఈ రేంజిలో హడావుడి చేస్తున్నారంటే.... సినిమా విడుదల ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్‌ జన్మదినం సందర్భగా ఏప్రిల్‌ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్‌తో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

English summary
Stylish Star Alllu Arjun is playing the lead role in upcoming action entertainer ‘Sarrainodu’ under the direction of Boyapati Sreenu. The film was earlier rejected by Gopichand and Ramcharan.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu