For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లాడబోతున్న హీరోయిన్ అనుష్క!

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: దక్షిణాదిన తన అందచందాలు, పెర్ఫార్మెన్స్‌తో టాప్ హీరోయిన్‌గా దూసుకెలుతున్న అనుష్క ప్రస్తుతం బాహుబలి, రుద్రమదేవి, లింగా లాంటి చారిత్రాత్మక భారీ ప్రాజెక్టులతో పాటు అజిత్ హీరోగా మరో సినిమా చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ సినిమాలను త్వరిత గతిన పూర్తి చేసుకోవాలని అనుష్క భావిస్తోంది. అదే సమయంలో కొత్త ప్రాజెక్టులు, కమిట్మెంట్స్ కూడా ఏమీ తీసుకోడం లేదు. ఇటీవల లింగా షూటింగు సెట్లో కొత్త డైరెక్టర్ ఓ సినిమా స్టోరీ చెప్పడానికి వస్తే చేయనని తెగేసి చెప్పిందట.

  అనుష్క ఎందుకు ఇలా చేస్తోందని ఆరా తీస్తే...ప్రస్తుతం తన చేతిలో ఉన్న కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలైపోవాలని ప్లాన్ చేసుకుంటోందట. అయితే అనుష్క వివాహం చేసుకోబోయే వ్యక్తి సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదని, అతనో బిజినెస్ మ్యాన్ అని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

  అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆమె బెంగుళూరులోని ఈస్ట్‌వుడ్ పాఠశాలలో కూడా పని చేసారు. నాగార్జున హీరోగా రూపొందిన ‘సూపర్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన అనుష్క గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అనుష్క గురించిన వివరాలు స్లైడ్ షోలో...

  అనుష్క

  అనుష్క

  అందాల ప్రదర్శనతో కుర్రకారులో మధురభావనలు రేపింది. వేదంలో సరోజగా కవ్వించినా, బిళ్లాలో బికినీతో కనిపించినా, విక్రమార్కుడుతో అందాలతో విజృభించినా, రగడతో అందాల రచ్చరచ్చ చేసినా ఆమెకే ఆమే పోటీ..సాటి అన్నట్లుగా వెండి తెరను వేడిక్కించింది.

  భారీ ప్రాజెక్టులు

  భారీ ప్రాజెక్టులు

  ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా మారింది. మొదట్లో అనుష్క అందాల ప్రదర్శనికే ప్రాధాన్యత ఇచ్చింది. అయితే అరుంధతి నుంచి ఆమె ఇమేజ్ మారింది. అందులో ఆమె అద్బుత నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పటి నుంచి స్టార్ హీరోయిన్ గా మారిన అనుష్క ఇప్పుడు భారీ పలు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.

  బెస్ట్ ఆఫ్షన్ అనుష్క

  బెస్ట్ ఆఫ్షన్ అనుష్క

  తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హీరోయిన్ల పాత్రలు కేవలం అందాల ఆరబోతకు, హీరోలతో రొమాన్స్ చేయడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. కానీ వీరందరికీ భిన్నంగా రాణిస్తోంది హాట్ అండ్ సెక్సీ తార అనుష్క. ఇటు గ్లామర్ పాత్రలతో పాటు ఇటు భారీ యాక్షన్ పాత్రలకు ఆమెను మించిన ఆప్షన్ తెలుగు ఫిల్మ్ మేకర్స్‌కు దొరకడం లేదు.

  అరుంధతితో మొదలు...

  అరుంధతితో మొదలు...

  ఇప్పటికే అరుంధతి సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో తన సత్తా చాటిన అనుష్క త్వరలో మరో రెండు భారీ యాక్షన్ చిత్రాల్లో వెండి తెరపై తన తడాకా చూపెట్టబోతోంది. ప్రస్తుతం అనుష్క రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాహుబలి' చిత్రంతో పాటు, గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి' చిత్రాల్లో నటిస్తోంది.

  English summary
  Anuskha is working in ‘Baahubali’, ‘Rudramadevi’, ‘Lingaa’, Ajith movie. After completing this movie Anuskha han’t signed any films. She is not acceoting any other films. As per closed resources Anuskha wants to marriage and settle down after Baahubali and no plans to work in any movies.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X