Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హాట్ న్యూస్: నితిన్ మళ్లీ అదే దర్శకుడుతో ఖరారు
హైదరాబాద్ : ప్రస్తుతం ఛార్మీతో చేస్తున్న "జ్యోతిలక్ష్మి" తర్వాత పూరి ఏ చిత్రం చేస్తారు ...మహేష్ తోనా, చిరంజీవితోనా అనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే మాకు అందిన సమాచారం ప్రకారం..టెంపర్ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని నితిన్ తో చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఓ స్టోరీ లైన్ ని విన్న నితిన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
చిన్నదాన నీ కోసం చిత్రం తర్వాత అనేక స్క్రిప్టులు విన్న నితిన్ ఈ ఒక్క ప్రాజెక్టుని మాత్రమే ఓకే చేసాడని తెలుస్తోంది. ఆ సినిమా ఫెయిల్యూర్ కావటంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు చెప్తున్నారు. మరో ప్రక్క పూరి జగన్నాథ్..వరుణ్ తేజ తో ఓ చిత్రం,టెంపర్ రీమేక్ చిత్రాలు కమిటయ్యి ఉన్నారు. అన్నీ బాగుంటే చిరంజీవి 150 చిత్రంగా తన దగ్గర ఉన్న ఆటో జానీ చిత్రం చేస్తారు.
జ్యోతిలక్ష్మీ విషయానికి వస్తే...

ఛార్మి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందనున్న జ్యోతిలక్ష్మి చిత్రం ముహూర్తం జరిగింది. ఈ నేపధ్యంలో ఆమె ఈ సెక్సీ ఇమేజ్ ని షేర్ చేస్తూ ముహూర్తం జరిగిందని తెలియచేసింది.
ఫుల్ జోరుమీదున్న స్పీడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా పూర్తవటంతో తన భవిష్యత్ సినిమాల పనిలో పడిపోయాడు. ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీతో కొత్త సినిమా తీయబోతున్నాడు. ఈ విషయాన్ని పూరీ జగన్నాథ్ తెలిపాడు. తను ఛార్మీ తో తీయబోయే సినిమా పేరు జ్యోతిలక్ష్మి అని వెల్లడించాడు. అయితే ఈ సినిమా నర్తకి జీవిత కథాంశంతో రూపొందిస్తున్నామని వెల్లడించాడు.
పేరు క్యాచీగా ఉండాలని ఆలోచిస్తే జ్యోతిలక్ష్మి అయితే బాగుంటుందని అది ఓకే చేశామని. అంతేగానీ ఈ సినిమా జ్యోతిలక్ష్మి నిజ జీవితానికి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ చిత్రం పూర్తికాగానే మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా తీస్తున్నట్లు తెలిపాడు.