»   » పవన్ మీడియా ఇంటర్వూలు : ఎవరికి ప్లస్? ఇచ్చిన కారణం?ఆ ఛానెల్ లో నో ఇంటర్వూ?

పవన్ మీడియా ఇంటర్వూలు : ఎవరికి ప్లస్? ఇచ్చిన కారణం?ఆ ఛానెల్ లో నో ఇంటర్వూ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్...మొన్న శుక్రవారం విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా రిలీజ్ ముందు దాకా బాలీవుడ్ మీడియాపై దృష్టి పెట్టిన పవన్ ..సినిమాకు టాక్ తేడారాగానే ఇక్కడ మీడియాకు కూడా ఇంటర్వూలు ఇచ్చారని టాక్ వచ్చింది.

అయితే ఆ ఇంటర్వూలలో సినిమాలు గురించి మాట్లాడింది, సినిమా టాపిక్ లు చాలా తక్కువ కావటం విశేషం. అలాగే ఈ ఇంటర్వూలు ఎంతవరకూ ఈ సినిమాను బూస్ట్ చేయటానికి పనికివచ్చాయనేది ట్రేడ్ లో అంచనాలు వేస్తున్నారు.


ఇక పవన్ ఇంటర్వూ అంటే వద్దనే ఛానెల్ కూడా ఉంటుందా అంటే ...జగన్ కు చెందిన సాక్షి ఛానెల్ ఉందీ అంటున్నారు. ఆ ఛానెల్ లో పవన్ ఇంటర్వూ రాలేదు. మీడియా వర్గాల్లో ఏమని చెప్పుకుంటున్నరంటే మొదట పవన్ ఇంటర్వూకు ఆ ఛానెల్ లోని ఉద్యోగస్తులు ఆసక్తిచూపించారు. అయితే పవన్ కు, వైయస్ జగన్ కు ఉన్న రాజకీయ విభేధాల కారణంతో పైనుంచే అపీషియల్ గా ఇంటర్వూ ని వద్దని చెప్పారని చెప్తున్నారు. పవన్ ఇంటర్వూ ల ో భాగంగా పొలిటికల్ గా ఏమైనా కామెంట్స్ చేస్తే తాము ప్రసారం చేయటానికి ఇబ్బంది అవుతుందని ఆ నిర్ణయం తీసుకున్నారంని చెప్పుకుంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.


Also Read: పవన్ ఇంటర్వూ :వర్మ కు వార్నింగ్, పెళ్లిళ్లపై, 'సర్దార్' టాక్ పై, పాలిటిక్స్ పై..ఇంకా చాలా వాటిపై


వారు చెప్పేదాని ప్రకారం...ఈ ఇంటర్వూలు ప్రబావం ..కలెక్షన్స్ పై ఏమాత్రం కూడా చూపలేదు. ఉన్నంతలో ఎన్ టీవి వారు అడిగిన ప్రశ్నలు కొంతవరకూ ఉపయోగపడ్డాయంటున్నారు. టీవి 9 అయితే పవన్ కళ్యాణ్ ని పూర్తి స్దాయి పొలిటికల్ స్టార్ గానే చూపించే ప్రయత్నం చేసి...ఆ తరహా ప్రశ్నలే వేసింది.


అంతెందుకు ఎప్పుడూ ఎవరినైనా తన స్టూడియోకు ఇన్వైట్ చేసి ఇంటర్వూలు చేసే రవిప్రకాష్ ..ఈ సారి పవన్ దగ్గరకు తానే వెళ్లారు. ఆయన అనుభవంతో అడిగిన ప్రశ్నలు బాగున్నాయని అంటున్నారు.


Also Read: పవన్ ఇంటర్వూ -2 : ఎర్ర కండువా, సిగ్గు, పార్టీ ,కొట్టాలనే, త్రివిక్రమ్ తో ఇంకెన్నో..


ముఖ్యంగా జనసేన పార్టి గురించి, చిరంజీవి తో సాన్నిహిత్యం గురించి, బిజేపి, రోహిత్ వేముల సూసైడ్ , కాపు రిజర్వేషన్స్ , అసహనం, రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ ఇలా ప్రతీ అంశం టచ్ చేసారు. పవన్ కూడా చాలా వాటికి ఫ్రాంక్ గా సమాధానాలు చెప్పటం జరిగింది.


అయితే ఎప్పుడూ మీడియా ముందుకు రావటం ఇష్టపడని పవన్ ఒక్కసారిగా బయిటకు వచ్చి ఇలా ఇంటర్వూలు ఇవ్వటానికి కారణాలు కూడా మీడియాలో చర్చకు వస్తున్నాయి. ఓ స్ట్రాటజీతోనే పవన్ ఇంటర్వూలు ఇచ్చాడని కూడా చెప్పుకుంటున్నారు.


నిజంగా స్ట్రాటజీనా..ఏంటనేది స్లైడ్ షోలో చదవండి...


డివైడ్ టాక్ వచ్చిందనే

డివైడ్ టాక్ వచ్చిందనే

పవన్ కేవలం ..సినిమాకు డివైడ్ టాక్ రావటంతోనే ఇంటర్వూలు ఇచ్చాడని, అంతకు మించివేరే కారణం లేదని కొందరంటున్నారు.నెక్స్ట్ సినిమా ఉంది...మీకే

నెక్స్ట్ సినిమా ఉంది...మీకే

నెక్ట్స్ సినిమా ఉంది..కంగారుపడకండి.. అని ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నవారికి, ఎగ్జిబిటర్స్ కు చెప్పటమే ఆయన ఉద్దేశ్యం అని కొందరంటున్నారు.కోపం వచ్చిందనే..

కోపం వచ్చిందనే..

వీటిన్నటికి భిన్నంగా.. కేవలం బాలీవుడ్ మీడియాకు మాత్రమే ఇంటర్వూలు ఇవ్వటం పై తెలుగు మీడియా చాలా కోపంగా ఉందని తెలుసుకున్న పవన్ ఇలా పిలిచి ఇంటర్వూలు ఇచ్చాడంటున్నారు.


ఈరోస్ ఒత్తిడి

ఈరోస్ ఒత్తిడి

తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ కొన్ని మేజర్ ఏరియాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈరోస్ వారి ఒత్తిడి మేరకే ఈ ఇంటర్వూలు అని కొందరంటున్నారు.


నెగిటివ్ ప్రచారం పెరగకుండా

నెగిటివ్ ప్రచారం పెరగకుండా

మార్నింగ్ షోకే ఈ చిత్రానికి నెగిటివ్ ప్రచారం రావటంతో అది పెరగకుండా ఉండటానికే ఇలా ఇంటర్వూలు ఇచ్చాడంటున్నారు.ఎంతవరకూ ప్లస్

ఎంతవరకూ ప్లస్

సినిమా ప్రమోషన్ కు తద్వారా కలెక్షన్స్ పెరగటానికి ఈ ఇంటర్వూలు ఏ మాత్రం ఉపయోగించలేదంటున్నారు.అందరూ ఒకే టైప్

అందరూ ఒకే టైప్

దాదాపు మీడియా సంస్దలన్నిటిలోనూ ఒకే తరహా ప్రశ్నలు, జవాబులు తొంగి చూసాయి.విసుగొచ్చిందా

విసుగొచ్చిందా

వరసగా ఒకరు తర్వాత మరొకరికి కంటిన్యూగా ఇలా ఇంటర్వూలు ఇవ్వటం, అవే ప్రశ్నలుకు జవాబులు ఇవ్వటం పవన్ కు విసుగెత్తించింది అంటున్నారు.గతంలోలాగ

గతంలోలాగ

ఇంతకు ముందు పవన్ ..ఓ యాంకర్ ని పిలిపించుకుని తన ఫామ్ హౌస్ లో ఇంటర్వూ ఇచ్చారు. అదే సీడిని అందరికీ పంపారు..ఇప్పుడూ అదే పద్దితి ఫాలో అయితే బాగుండేది అంటున్నారు.


బాలీవుడ్ మైనస్

బాలీవుడ్ మైనస్

ఈ సినిమాకు డివైడ్ టాక్ రావటానికి ప్రధాన కారణం...బాలీవుడ్ నుంచి వచ్చిన టాక్ కూడా ఇన్ఫూలియన్స్ చేసిందంటున్నారు. కేవలం ఇక్కడ టాకే అయితే ఇంత నెగిటివ్ గా ఉండేది కాదని చెప్తున్నారు.


డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి

డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి

సినిమా కలెక్షన్స్ డ్రాప్ అవుతున్న నేపధ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఒత్తిడి వచ్చే అవకాసముందని ట్రేడ్ లో వినపడుతోంది.నచ్చింది

నచ్చింది

ఎవరు ఎలా ఉందన్నా..ఫ్యాన్స్ మాత్రం మొదటి నుంచి ఒకటే మాట మీద ఉన్నారు. తమకు సినిమా నచ్చిందని చెప్తున్నారు.English summary
Pawan Kalyan interacted with media for the first time three days after his film Sardar Gabbar Singh hit the screens on April 8 during Ugadi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu