»   » స్టార్ హీరోపై మోజు, సీక్రెట్ గా విదేశాలకు జంప్, లీక్ కాకూడదని ఆమె కండీషన్

స్టార్ హీరోపై మోజు, సీక్రెట్ గా విదేశాలకు జంప్, లీక్ కాకూడదని ఆమె కండీషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రస్తుతం ఒంటిరిగా ఉంటున్న హృతిక్ రోషన్ మరోసారి రిలేషన్ షిప్ కు సంభందించిన వార్తల్లో నిలిచారు. కెరీర్ సంగతి ఎలా ఉన్నా ముందు తనకు రిలాక్స్ కావాలని ఓ హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు.

ఆ హాలీడే ట్రిప్ స్పెషాలిటీ ఏమిటీ అంటే... తన తాజా గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుని వెళ్లారట. అయితే ఆమె ఎవరనేది ఇప్పటికి బయిటకు లీక్ కాలేదు. ఆమె ఇండస్ట్రీకి చెందినది అని కొందరంటూంటే, కాదు ఇండస్ట్రిలియిస్ట్ కుమార్తె అని మరికొందరంటున్నారు. అయితే ఆమె వివరాలు ఎవరికీ , ఎక్కడా లీక్ కూకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుని ప్లాన్ చేసారని బాలీవుడ్ సినీ వర్గాల్లో వినపడుతోంది. అందుకు కారణం..ఆమె చాలా స్ట్రిక్టు గా చెప్పిందట. బయిట ఫలానా నేను అని బయిటపడకూడదని.

నవంబర్ 28న ఆయన ఆయన అవుటింగ్ కు వెళ్లారు. ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా హృతిక్ తన పర్శనల్ టీమ్ ని తీసుకు వెల్తాడట. అయితే ఈ సారి ఒక్కరు కూడా ఆయనతో తీసుకువెల్లలేదట. ఎంతో నమ్మకంగా , ఆయనతో మొదటి నుంచి జర్ని చేస్తున్నవారిని కూడా వదిలేసాడట.

Hrithik goes for a hush-hush holiday with special someone?

చిన్న లీక్ కూడా పెద్ద విషయమైపోతోందని , ఈ జాగ్రత్తలు హృతిక్ తీసుకున్నాడని బి టౌన్ లో వినపడుతోంది. ఇప్పుడున్న పరిస్దితుల్లో ఎవరినీ నమ్మేలా లేదని ఆయన ఇలా ఫిక్సైడంటంటున్నారు.

తాజా చిత్రం విషయానికి వస్తే... హృతిక్‌ రోషన్‌ తాజా చిత్రం 'కాబిల్‌' తెలుగులో అనువాదమవుతోంది. హృతిక్‌, రాకేష్‌ రోషన్‌ తాజా కాంబినేషన్‌ చిత్ర మిది. గతంలో వీరిద్దరి కలయికలో 'కహోనా ప్యార్‌హై', 'క్రిష్‌', 'క్రిష్‌ 3', 'కోయి మిల్‌గయా' వంటి చిత్రాలు వచ్చాయి. తాజా చిత్రం 'కాబిల్‌' భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో హృతిక్‌ సరసన యామి గౌతమ్‌ హీరోయిన్ గా నటించింది.

రాకేష్‌ రోషన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజయ్‌ గుప్తా దర్శకత్వం వహిం చారు. జనవరి 26, 2017లో ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. గతంలో హృతిక్‌ నటించిన 'క్రిష్‌', 'దూమ్‌ 3' చిత్రాలు తెలుగులో అనువాదమై విజయం సాధించాయి. 'కాబిల్‌' టీజర్‌ను దీపావళికి విడుదల అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. రాజేష్‌ రోషన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగులో బలం టైటిల్ తో విడుదల అవుతోంది.

English summary
A little birdie tells us that Hrithik has gone for a ‘well-planned’ holiday with a special someone he doesn’t want anyone to know about.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu