»   » పవర్ స్టార్ సినిమాకు క్రేజీ టైటిల్.. రామోజీలో దుబాయ్ మేడ.. పవన్ కోసం త్రివిక్రమ్ భారీ సెట్..

పవర్ స్టార్ సినిమాకు క్రేజీ టైటిల్.. రామోజీలో దుబాయ్ మేడ.. పవన్ కోసం త్రివిక్రమ్ భారీ సెట్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కల్యాణ్ సినిమాకు పెద్దగా సెట్లు వేసిన దాఖలాలు గతంలో లేవు. కానీ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం కోసం గతంలో ఎన్నడూలేని విధంగా సెట్ వేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పవన్ కల్యాణ్ సినిమాను చాలా రిచ్‌గా చిత్రీకరించేందుకు ఖర్చు వెనుకాడకపోవడం గమనార్హం. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ రానున్న చిత్రం కోసం దుబాయ్ సెట్ వేశారన్న వార్త ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఆసక్తికరంగా టైటిల్

ఆసక్తికరంగా టైటిల్

పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చిన సినిమా టైటిల్స్ జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అప్పట్లో పవన్ సినిమాకు అత్తారింటికి దారేది సినిమా టైటిల్ అనగానే ఇదేంటీ అని ముక్కున వేలు వేసుకొన్నారు. ఆ తర్వాత ఆ సినిమాను చూసిన ప్రేక్షకులు వారెవ్వా అంటూ కితాబు ఇచ్చారు. ఫ్యామిలీ అంతా చూసే స్టోరీకి తగినట్టుగా ఉందని ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం పవన్, త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన పేర్లు కూడా చాలా ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ వైరల్‌గా మారింది. గోపాలకృష్ణుడు అనే ప్రముఖంగా వినిపిస్తున్నది.

కథానుగుణంగా భారీ సెట్

కథానుగుణంగా భారీ సెట్

ఈ చిత్రం కోసం అత్యంత భారీస్థాయిలో సెట్లు వేశారు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా హై రేంజ్‌లో వినియోగిస్తున్నారట. భారీత‌నం, రిచ్ లుక్ విష‌యంలో త్రివిక్ర‌మ్ ఏమాత్రం రాజీకి రాకపోవడంతో బడ్జెట్ గురించి ఆలోచించడం లేదట. నిర్మాత రాధాకృష్ణ ఏమాత్రం రాజీకి పడటం లేదనేది ప్రస్తుతం టాక్. కథకు అనుగుణంగా క్వాలిటీ రావడానికి ఖర్చుకు వెనుకాడటం లేదనేది తాజా సమాచారం. కథ కోసం దుబాయ్‌లో ఉండే భారీ భవనం సెట్‌ను వేయడం విశేషం. దుబాయ్‌లో అత్యంత సంపన్నులు ఉండే ప్రాంతానికి సంబంధించిన సెట్‌ కోసం రూ.1.5 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తున్నది.

కళ్లు చెదిరిపోయే భవనం..

కళ్లు చెదిరిపోయే భవనం..

ఈ భారీ భవనం సమీపంలో కళ్లు జిగేల్ అనిపించే లైటింగ్ తెరపైన అద్భుతంగా ఉంటుందనే వార్త ప్రచారంలో ఉంది. బిలియన్ డాలర్ల మేర వ్యాపారం చేసే కంపెనీల సముదాయంలో ఉండే పవన్ కల్యాణ్ ఆఫీస్ సెట్‌‌ను చాలా రిచ్‌గా డిజైన్ చేశారని, దాని కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారనేది టాలీవుడ్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

రామోజీలో దుబాయ్ వాతావరణం..

రామోజీలో దుబాయ్ వాతావరణం..

రామోజీ ఫిలిం సిటీలో దాదాపు చిన్నపాటి దుబాయ్ నగరాన్నే ఏర్పాటు చేశారనే మాట వినిపిస్తున్నది. ఆ భవనం వెనుక దుబాయ్ వాతావరణాన్ని తలపించేందుకు వీఎఫ్ఎక్స్ టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకొన్నారనేది ఇన్‌సైడ్ టాక్. వీఎఫ్ఎక్స్ కోసం విక్రమ్ కుమార్ చిత్రం రూ.24 చిత్రానికి పనిచేసిన టీమ్ రంగంలోకి దించారట.

ఒప్పుకోని పవన్ కల్యాణ్

ఒప్పుకోని పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ సినిమాకు గతంలో లేని విధంగా గుణశేఖర్ మాదిరిగా భారీ సెట్లు ఎందుకు వేస్తున్నారనే ప్రశ్న రాకమానదు. అయితే తొలుత దుబాయ్‌లో షూట్ చేద్దామని ప్లాన్ చేయాలని నిర్ణయించారట. కానీ పవన్ అందుకు ఒప్పుకోకపోవడంతో రామోజీ ఫిలిం సిటీని ఓ దుబాయ్ నగరంగా మార్చారట. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో హల్‌చల్ చేస్తున్న దుబాయ్ మేడ కథా కమామిషు ఇది.

English summary
Pawan Kalyan, Trivikram Srinivas movie shooting in under shooting. First time huge set was designed for Power star movie. Rs.1.5 crore spent for Pawan's office. 24 movie technicians are doing VFX work.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu