twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ సినిమాలపై ఇన్ కమ్ టాక్స్ డేగ కన్ను..?

    By Sindhu
    |

    'దూకుడు", 'ఊసరవెల్లి" చిత్రాల నిర్మాతలు అసలు తమ సినిమా ఎంత కలెక్ట్ చేసిందనే విషయాన్ని బయటికి చెప్పకుండా..గొప్పలకి పోతూ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఇటీవల విశ్లేషకులు, పరిశీలకులు గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. మ‌హేష్‌బాబు న‌టించిన దూకుడు, ఎన్టీఆర్ న‌టించిన ఊస‌ర‌వెల్లి చిత్రాల క‌లెక్షన్ల లెక్కల‌న్నీ త‌ప్పులేన‌ని, ఒక‌రికి మించి ఒక‌రు పోటీగా త‌మ త‌మ సినిమా క‌లెక్షన్స్ కోట్లలో వ‌సూల‌య్యాయ‌ని ప్రక‌టించుకున్నారు ఆయా చిత్రాల నిర్మాత‌లు. దూకుడు ఒక రోజు రికార్డు క‌లెక్షన్స్ 12 కోట్లని ప్రక‌టిస్తే, ఊస‌ర‌వెల్లి చిత్రం ఒక రోజు క‌లెక్షన్స్ 17 కోట్లుగా ఆయా నిర్మాత‌లు ప్రక‌టించుకున్నారు. ఈ క‌లెక్షన్ల వివ‌రాల‌న్నీ త‌ప్పుడు లెక్కలే అని అంద‌రూ అంటున్నారు. తాజాగా ఫిలించాంబ‌ర్ కూడా ఈ లెక్కల‌న్నీ త‌ప్పులే అని తేల్చేసిన విషయం తెలిసిందే.

    రికార్డుల వేట‌లో ప‌డి ఇలా త‌ప్పుడు లెక్కలు చూపించ‌డంతో సినిమా ఇండ‌స్ట్రీకే న‌ష్టం వాటిల్లుతుంద‌ని, ఇక‌నైనా ఇలా త‌ప్పుడు లెక్కలు చూపించ‌డానికి నిర్మాత‌లు అత్యుత్సాహం ప్రద‌ర్శించ‌రాద‌ని ఫిలించాంబ‌ర్ కోరింది. కానీ అప్పుడు గొప్పలు చెప్పిన ఈ చిత్రాల నిర్మాతలు ఇరుకున పడే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరి చూసిన లెక్కలను ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఓ కంట కనిపెడుతోందట. అసలు ఈ సినిమాలు ఎంత కలెక్ట్ చేసాయి..వీళ్ళు కరెక్ట్ లెక్కలు చూపిస్తున్నారా అనే విషయాన్ని పరిశీలించడానికి ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ సమాయత్తమవుతోందని విశ్వసనీయ సమాచారం.

    English summary
    The festival of Dussehra came up with two hits in the form of Dookudu and Oosaravelli and the makers went out of their way to talk about their collections. However, all this is likely to land them in trouble. News is that the income tax authorities have begun to cast their eyes on the actual revenues generated from both films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X