For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్.. ఆ దర్శకుడైతే కరెక్ట్.. ఇంట్రెస్టింగ్ ప్లాన్!

  |

  1990లో టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అప్పటివరకు ఉన్న బాక్సాఫీస్ కలెక్షన్స్ రికార్డులను తిరగరాయడమే కాకుండా అప్పట్లో అత్యధికంగా ఎక్కువ సెంటర్లలో ప్రదర్శించబడిన సినిమా కూడా అదే. అయితే ఆ సినిమాకు సీక్వెల్ ని రెడీ చేయాలని నిర్మాత అశ్వినీదత్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారుతోంది.

  క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్..

  క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్..

  మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి లను తప్ప ఆ పాత్రలకు మరొకరిని ఉహించుకోగలమా అనే సందేహాలకు మెగాస్టార్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. ఒకానొక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ చేయాలని చాలా కోరికగా ఉందని చెప్పాడు. ఇక శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ అందుకు కరెక్ట్ గా సెట్టవుతుందని కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇక నిర్మాత అశ్వినీదత్ కూడా అందుకు రెడీ అన్నారు.

  రామ్ చరణ్ తో డీల్ సెట్టయినట్లే..

  రామ్ చరణ్ తో డీల్ సెట్టయినట్లే..

  నిర్మాత అశ్వినీదత్ ప్రస్తుతం ప్రభాస్ తో ఒక పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ RRR అనే పాన్ ఇండియా సినిమాతో బలంగా రెడీ అవుతున్నారు. ఇక నెక్స్ట్ వీరి కాంబినేషన్ లోనే మరో పాన్ ఇండియా సినిమా వచ్చే అవకాశం ఉందట. అందుకు సంబంధించిన కథనాలు చాలానే వస్తున్నాయి. చిరుత సినిమా తరువాత రామ్ చరణ్ మళ్ళీ వైజయంతి ప్రొడక్షన్ లో నటించలేదు. ఇక ఫైనల్ గా ఇద్దరి మధ్య ఒక డీలింగ్ సెట్టయినట్లు టాక్.

  కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో..

  కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో..

  అసలు మ్యాటర్ లోకి వస్తే నిర్మాత అశ్వినీదత్, రామ్ చరణ్ తో ఎలాగైనా జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ని తెరకెక్కించాలని స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరనేది బిగ్ మిస్టరీగా మారింది. కె.రాఘవేంద్రరావు అప్పట్లో తన మేకింగ్ తో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక ఈ సారి ఆయన కేవలం దర్శకత్వ పర్యవేక్షణలోనే సినిమా రూపొందే అవకాశం ఉందట.

  అతను దర్శకుడంటే ఒప్పుకుంటారా?

  అతను దర్శకుడంటే ఒప్పుకుంటారా?

  ఇక దర్శకుడు ఎవరనే విషయంలో ఒక కొత్త కథనం వైరల్ అవుతోంది. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ డైరెక్ట్ చేస్తాడని టాక్ నడుస్తోంది. అయితే ఈ దర్శకుడి గత సినిమాలు అనగనగా ఒక ధీరుడు, సైజ్ జీరో సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ మధ్య బాలీవుడ్ లో కంగనా రనౌత్ తో చేసిన జడ్జిమెంటల్ హై క్యా అనే సినిమా పరవలేదనిపించింది. అయితే జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ని అతని చేతుల్లో పెడితే అభిమానులు ఈ విషయంలో కొంత ఆందోళన చెందకుండా ఉండలేరని చెప్పవచ్చు.

  #HBDSSRajamouli : Jr NTR to Ajay Devgn, Wishes Pour in on Twitter | Waiting For RRR
  అతనైతే కరెక్ట్ గా న్యాయం చేయగలడని..

  అతనైతే కరెక్ట్ గా న్యాయం చేయగలడని..

  ఇక నిర్మాత అశ్వినీదత్ మనసులో మాత్రం దర్శకుడు ఎవరనే విషయంలో ఒక ఆలోచన బలంగా ఉందట. తన అల్లుడు నాగ్ అశ్విన్ తోనే ఈ ప్రతిష్టాత్మక సీక్వెల్ ని తెరకెక్కిస్తే అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నారట. ఎందుకంటే మహానటి సినిమాతో తన టాలెంట్ ఎంటో నిరూపించుకున్న నాగ్ అశ్విన్ ఇప్పుడు ప్రభాస్ తో ఏకంగా సైన్స్ ఫిక్షన్ సినిమాను సెట్స్ పైకి తెస్తున్నాడు. అతనైతే కరెక్ట్ గా న్యాయం చేయగలడని చెప్పవచ్చు. ఇక ఈ జగదేకవీరుడు అతిలోక సుందరి తెరపైకి ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియాలి అంటే మరో రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే.

  English summary
  Jagadeka Veeru Atiloka Sundari is a 1990 blockbuster film. Little is said about the records that the film has created. Apart from rewriting the existing box office collections, it was also the highest grossing film of the time. However, producer Ashwinidat is working hard to prepare a sequel to the film. And the latest is becoming a news hot topic.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X