»   » ఐపీఎల్ 11 ఓపెనింగ్ సెర్మనీ: 15 నిమిషాల డాన్స్... రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్?

ఐపీఎల్ 11 ఓపెనింగ్ సెర్మనీ: 15 నిమిషాల డాన్స్... రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
IPL 2018 : Who Will Perform At Opening Ceremony ? Know Here

ఇండియాలో క్రికెట్ అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఐపీఎల్ సూపర్ సక్సెస్ అయింది. త్వరలో ఐపీఎల్ 11వ ఎడిషన్ ప్రారంభం కాబోతోంది. దీని ప్రసార హక్కుల కోసం పలు స్పోర్ట్స్ టీవీ ఛాన్సల్స్ వందల కోట్లు ఖర్చు చేశాయి. ఈ టోర్నీ సందర్భంగా వ్యాపార ప్రకటనల ద్వారా వేల కోట్ల ఆదాయం రానుంది. ఏప్రిల్‌ 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభ వేడుక కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించబోతున్నారు.

ఈ ప్రారంభ వేడుకలో పలువురు బాలీవుడ్ స్టార్స్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబతోన్నారు. ఈ వేడుకలో పెర్ఫార్మ్ చేసేందుకు బాలీవుడ్ యంగ్ స్టార్ రణ్‌వీర్‌ సింగ్ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని, కేవలం 15 నిమిషాల ప్రదర్శన ఇవ్వడం కోసం ఏకంగా రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ ఆయన అందుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

IPL 2018 opening ceremony: Ranveer Singh will be paid Rs 5 cr for 15 minutes dance?

పద్మావతి సినిమా విజయంతో రణవీర్ సింగ్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది, దీంతో పాటు దీపికతో లవ్ ఎఫైర్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. యూత్ మెచ్చే క్రేజీ స్టార్ కావడంతో అతడి కోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి నిర్వాహకులు వెనకాడటం లేదని అంటున్నారు.

ప్రస్తుతం రణవీర్ సింగ్ 'గుల్లీ బాయ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానీ, సునీల లుల్లా నిర్మాతలు. అలియా భట్, కల్కి కొచ్లిన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

English summary
If recent reports are anything to go by, then we might get to see Ranveer performing at the opening ceremony of the upcoming 11the edition of the Indian Premiere League. If a report on the Hindustan Times is anything to go by, then the actor is likely to be paid a whopping sum of Rs 5 crore for a 15-minute long performance.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X