»   » స్త్రీలపై చలపతి కామెంట్లు దారుణం.. వాటితో పోలిస్తే ఇవి ఎంత.. సీనియర్ నటి!

స్త్రీలపై చలపతి కామెంట్లు దారుణం.. వాటితో పోలిస్తే ఇవి ఎంత.. సీనియర్ నటి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రారండోయ్ వేడుకు చూద్దాం ఆడియో ఆవిష్కరణలో మహిళలపై దారుణమైన కామెంట్ చేసిన సీనియర్ నటుడు చలపతిరావుపై సామాన్య జనం నుంచే కాకుండా సినీ పరిశ్రమకు చెందిన వారి గురించి కూడా నిరసన పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నది. బహిరంగ వేదికలపైనే కాకుండా షూటింగుల్లో కూడా మహిళా నటులను టార్గెట్‌గా చేసుకొని సూటిపోటి మాటలతో వేధిస్తారనే విషయం కూడా తాజాగా ప్రచారంలోకి వచ్చింది.

నటి ప్రగతి స్పందన ఇలా..

నటి ప్రగతి స్పందన ఇలా..

చలపతిరావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ అన్నపూర్ణ సుంకర పోస్ట్‌కు స్పందిస్తూ ప్రముఖ నటి ప్రగతి కొన్ని నిజాలు బయటపెట్టినట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. చలపతిరావు షూటింగ్స్‌లో ఆడవాళ్లపై చేసే కామెంట్స్‌తో పోలిస్తే ఇది చాలా చిన్నది. చాలా చీప్‌గా బిహేవ్ చేస్తుంటాడు. సీనియర్ నటుడు అనే భయంతో ఆయనను ఏమి అనరు. వ్యక్తిగతంగా ఆయన చాలా మంచోడు. ఆయన మాటతీరు అలా ఉంటుంది అని స్పందించినట్టు తెలిసింది.

కళ్ల ముందటే చాలా దారుణంగా..

కళ్ల ముందటే చాలా దారుణంగా..

చలపతిరావుతో నాకు వ్యక్తిగతంగా ఇలాంటి అనుభవాలు లేకపోవడం నిజంగా అదృష్టమే. కానీ నా కళ్ల ముందు చాలా మంది ఆడవాళ్లతో అతను దారుణంగా మాట్లాడటం జరిగింది. నేను దానికి ఏమీ చేయలేకపోయినందుకు సిగ్గు పడుతున్నాను. స్త్రీలపై ఆయన చేసే కామెంట్లు చాలా భయంకరంగా ఉంటాయి' అంటూ ప్రగతి ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు..

ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు..

మహిళలపై చేసిన కామెంట్లకు చలపతిరావు సారీ చెప్పినా ఇప్పట్లో ఈ వివాదం సద్దుమణిగేలా లేదు. చాలా మంది ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నారు. జబర్దస్ట్, పటాస్ లాంటి టెలివిజన్ కార్యక్రమాల్లో ఆడవాళ్లపై చేస్తున్న దారుణమైన కామెంట్లపై నిరసన జ్వాలలు సోషల్ మీడియాలో ఎగిసిపడుతున్నాయి. ఈ వివాదం చూస్తేంటే చినికి చినికి గాలివానగా మారి కేవలం చలపతిరావుకే కాదు మరికొందరికి కూడా మూడినట్టే కనిపిస్తున్నది.

అయితే ప్రగతి వ్యాఖ్యలు చేసినట్టు మీడియాలో వస్తున్నప్పటికీ.. ఎక్కడ ఆధారాలు దొరకలేదు. ఒకవేళ బహిరంగంగా ప్రగతి బయటకు వచ్చి వెల్లడిస్తే మహిళలకు మేలు చేసిన ఓ సాటి స్త్రీగా ప్రగతికి గుర్తింపు లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఓ సీనియర్ నటుడుపై ఆమె వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

నా వ్యాఖ్యల్లో తప్పులేదు..

నా వ్యాఖ్యల్లో తప్పులేదు..

ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను సారీ చెప్పినా.. తన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదు. నా వ్యాఖ్యలపై ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారు. మైనర్ బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. వాటి గురించి ఎందుకు పట్టించుకోరు అని చలపతిరావు నిలదీయడం గమనార్హం.

English summary
Reports suggest that Actress Pragathi commented seriously on Chalapathirao incident. According to social media report She said made some allegations on Chalapathi rao and claimed that she directly seen such kind of situation in the shooting.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu