AA22 X A6: పాన్ వరల్డ్‌గా అల్లు అర్జున్, అట్లీ మూవీ..హాలీవుడ్ సంస్థ రంగంలోకి!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దక్షిణాదిలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరిగిపోతున్నది. ఇక ఈ సినిమా గురించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ భారీ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా మొదలై ఈ సినిమా ప్రస్తుతం పాన్ వరల్డ్ మూవీగా మార్చేందుకు అడుగులుపెడుతున్నాయి. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాను భారీగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్‌తో నిర్మిస్తున్నట్టు ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నాలుగు పాత్రల్లో కనిపించబోతున్నారు. తాతగా, తండ్రిగా, ఇద్దరు కుమారుల పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టైమ్ ట్రావెల్, పునర్జన్మ లాంటి అంశాల ఆధారంగా సాగుతుందనే విషయం సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. అయితే ఈ సినిమా షూటింగ్ ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో భారీగా తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు నటిస్తుండటం మరో విశేషంగా మారింది. దీపిక పదుకోన్ మెయిన్ లీడ్‌లో నటిస్తుండగా.. రష్మిక మందన్న, మృణాల్ థాకూర్, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ భోర్సే తదితరులు నటిస్తున్నారనే విషయం మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారనే వార్త కూడా తాజాగా వెలుగు చూసింది.
ఇదిలా ఉండగా, హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ వీఎఫ్ఎక్స్ కంపెనీ ఈ సినిమా కోసం పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకొన్నది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా భారీగా, అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దేందుకు సిద్దమవుతున్నది. ఈ సినిమా కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి టెక్నిషియన్స్ కసరత్తు చేస్తున్నారు. ఈ సినిమాను సుమారుగా 700 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు అని ఇండస్ట్రీలో ఓ టాక్ కొనసాగుతున్నది.
అయితే ఇవన్నీ పక్కన పెడితే.. ఈ సినిమాను గ్లోబల్ మూవీగా మార్చేందుకు సన్ పిక్చర్స్ భారీ ప్రణాళికను సిద్దం చేసింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేయడానికి హాలీవుడ్‌లోని వార్నర్ బ్రదర్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోబోతున్నారు. విదేశాల్లో ఈ సినిమాను రికార్డు స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ సిద్దం చేశారు. ఆ కారణంగానే వార్నర్ బ్రదర్స్ సహకారం తీసుకోనున్నారనే వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.


Click it and Unblock the Notifications











