Don't Miss!
- News
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!!
- Finance
Telangana Budget: కీలక రంగాలకు కేటాయింపులు ఇలా.. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా..
- Sports
INDvsAUS : స్పిన్ పిచ్‌లతో భారత్‌కూ సమస్యే?.. రికార్డులు చూస్తే తెలిసిపోతోంది!
- Travel
ప్రపంచ స్థాయి పర్యాటక గ్రామం.. పోచంపల్లి విశేషాలు!
- Technology
బెట్టింగులు, లోన్లు అంటూ ప్రజలను వేధిస్తున్న 230 యాప్ లు బ్యాన్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆ దర్శకుడితో అనుష్క.. యాక్షన్ సీన్స్‌లో స్వీటీ?
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క బాహుబలితో జాతీయ స్థాయిలో గుర్తింపును దక్కించుకుంది. అయితే ఆ చిత్రాలు చేసిన తరువాత స్వీటీ సినిమాలు చాలా వరకు తగ్గించుకుంది. బాహుబలి తరువాత భాగమతి తప్పా మరో చిత్రాన్ని చేయలేదు. ఎంతో జాగ్రత్తగా సెలెక్టెడ్‌గా స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ.. ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతం అనుష్క నిశ్శబ్దం అనే థ్రిల్లర్‌లో నటిస్తోంది.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్, సాంగ్ సినిమాపై హైప్ పెంచేశాయి. మూగ పాత్రలో నటిస్తోన్న అనుష్క.. ఈ చిత్రానికి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. అనుష్క నటించబోయే సినిమా ఏంటి? అనే కథనాలు హల్చల్ చేస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించి ఓ అప్‌డేట్ వైరల్ అవుతోంది. రీసెంట్ గా అనుష్క తన నెక్స్ట్ సినిమా కు పచ్చజెండా ఊపిందని టాక్ నడుస్తోంది.

తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ స్టైల్, టేకింగ్ గురించి అందరికీ తెలిసిందే. తమిళ దర్శకుడే అయినా తెలుగులోనూ ఆయనకు అభిమానులున్నారు. అయితే ఈమధ్య అనుష్కకు ఒక ఇంట్రెస్టింగ్ కథ వినిపించారని తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో ఉన్న ఈ కథ అనుష్కకు బాగానే నచ్చిందంట. అందుకే ఎక్కువ అలోచించకుండా అనుష్క ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. ఈ చిత్రంలో అనుష్కరిస్కీ ఫైట్స్ కూడా చేస్తుందని సమాచారం. ఈమధ్య గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన సినిమాలు పెద్దగా విజయం సాధించడం లేదు. మరి ఈ సినిమాతో అయినా విజయం సాధిస్తాడా అనేది చూడాలి.