twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమెడియన్ అలీకి వైఎస్ జగన్ కీలక పదవి? పేర్ని నాని పిలుపుతో హుటాహుటిన విజయవాడకు..

    |

    తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టాలీవుడ్ అగ్రనటులు, దర్శకులు, నిర్మాతల భేటి ప్రధాన అంశంగా మారింది. ఈ కీలక భేటీ నేపథ్యంలో ప్రముఖ హాస్య నటుడు ఆలీకి ఆహ్వానం రావడం మీడియాలో ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు ఎక్కడా ప్రస్తావించకుండా అనూహ్యంగా ఆలీ పేరు తెరపైకి రావడం వెనుక ఆసక్తికరమైన విషయం మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

    గత ఎన్నికలకు ముందు వైసీపీలో అలీ

    గత ఎన్నికలకు ముందు వైసీపీలో అలీ

    టాప్ కమెడియన్ ఆలీ గత కొన్నేళ్లుగా పరోక్షంగా రాజకీయాల్లో ఉన్నారు. దాదాపు పదేళ్లపాటు తెలుగుదేశం పార్టీతో ఆయన కొనసాగారు. ఆ తర్వాత జనసేన పార్టీని స్థాపించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో అనుబంధాన్ని కొనసాగించారు. అయితే గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అందర్నీ షాక్ గురిచేసింది.

    వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు అలీ ప్రచారం

    వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు అలీ ప్రచారం

    అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్గీలో చేరిన కమెడియన్ అలీ విస్తృతంగా పార్టీకి సేవలు అందించారు. పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ పార్టీ అభివృద్ధికి దోహదం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత అలీ కలిసిన దాఖలాలు కనిపించలేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న సందర్భాలు లేవు. అయితే అనూహ్యంగా అలీకి ఆహ్వానం పంపడం ద్వారా ఆయనకు సేవలకు గుర్తింపు ఇచ్చే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తున్నదనే అంశం మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

    ఏపీ సీఎంతో చర్చలకు ముందు ఆలీకి ఆహ్వానం

    ఏపీ సీఎంతో చర్చలకు ముందు ఆలీకి ఆహ్వానం

    అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఆలీకి సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని నుంచి ఆహ్వానం అందడం జరిగింది. అధికారికంగా ఆహ్వానం అందడంతో బుధవారం రాత్రే ఆలీ విజయవాడకు బయలుదేరి వెళ్లారని ఆయన సన్నిహితులు వెల్లడించారు. అయితే సినీ ప్రముఖులతో కాకుండా ఆలీ ప్రత్యేకంగా రోడ్డు మార్గంలో వెళ్లడం మరింత చర్చనీయాంశమైంది.

    ఆలీ సేవలను గుర్తించి.. వైఎస్ జగన్

    ఆలీ సేవలను గుర్తించి.. వైఎస్ జగన్

    అయితే వైఎస్ఆర్ పార్టీకి అలీ అందించిన సేవలకు గుర్తుగా సీఎం వైఎస్ జగన్ కీలక పదవిని కట్టబెట్టేందుకు నిర్ణయం తీసుకొన్నారనే విషయం మీడియాలో ప్రచారం అవుతున్నది. ఈ క్రమంలోనే సీఎం జగన్ పేషి ఆయనకు ఆహ్వానం పంపారని, పేర్ని నానితో సమాచారం అందించారనే విషయం విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ విషయంపై ఇరువర్గాలు గుంభనంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఈ సాయంత్రం గానీ, మరికొద్ది రోజుల్లో ఆలీకి ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారనే విషయం స్పష్టమయ్యే అవకాశం ఉంది.

    పార్టీ సానుభూతి పరులకు కీలక పదవులు

    పార్టీ సానుభూతి పరులకు కీలక పదవులు

    గత కొద్దిరోజులుగా తెలుగు సినిమా నుంచి ఎదురైన ప్రతీకూల పరిస్థితుల నేపథ్యంలో టాలీవుడ్‌లో తనదైన పట్టుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారని, ఆ క్రమంలో మా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నదనే వార్తలు కూడా మీడియాలో వచ్చాయి. అయితే ప్రస్తుతం పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి ప్రభుత్వంలో నామినేటేడ్ పోస్టుల ద్వారా కీలక పదవులను అప్పగించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఈ సమావేశంలో అలీకి ప్రాధాన్యం కలిగించారనే ప్రచారం జరుగుతున్నది. ఈ వార్తల నేపథ్యంలో అలీకి ఎలాంటి కీలక పదవి దక్కుతుందనే విషయంపై సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

    Recommended Video

    Tollywood Meets CM YS Jagan, 20 శాతం షూటింగ్ AP లోనే..!| Filmibeat Telugu

    వైఎస్ జగన్‌తో భేటీ అయిన ప్రముఖులు వీరే..

    ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమైన వారిలో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, ఆర్ నారాయణ మూర్తి, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డి, నటుడు పోసాని కృష్ణమురళీ ఉన్నారు. ఈ మధ్యాహ్నం ఏపీ సీఎంతో సినీ పరిశ్రమ పెద్దలు కీలక సమావేశం జరుపనున్నారు.

    English summary
    Tollywood top heroes Chiranjeevi, Prabhas, Mahesh Babu, Directors Rajamouli, Koratala Shiva and Producers Niranjan Reddy are going to deliberations with AP CM YS Jaganmohan Reddy on several issues regarding Telugu film Industry. Chiranjeevi, Nagarjuna, RRR and Radhe Shyam producers meeting with AP CM on 10th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X