»   » షాక్: 'లయన్‌' కథ ఇదా? ఆ సినిమాతో పోలికా?

షాక్: 'లయన్‌' కథ ఇదా? ఆ సినిమాతో పోలికా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణ హీరో గా నటించిన చిత్రం 'లయన్‌'. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. సత్యదేవా దర్శకత్వం వహించారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి ఓ వార్త బయిటకు వచ్చింది. అది మరేదో కాదు...రవితేజ నటించిన పవర్ చిత్రానికి ...బాలయ్య 'లయన్‌' కు కథ విషయంలో దగ్గర పోలికలు ఉన్నాయంటూ.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అలాగే... 'లయన్‌' చిత్రం నిర్మాతలు తొలి నుంచి తమ చిత్రం ద్విపాత్రాభినయం అని చెప్తూ వస్తున్నారు. అయితే అలాంటిదేమని ఫిల్మ్ నగర్ టాక్. 18 నెలలు పాటు కోమాలో ఉండి బయిటకు వచ్చిన బాలకృష్ణ కథ ఇదని చెప్తున్నారు. అమ్నిషియా పేషెంట్ గా గతాన్ని మర్చిపోయిన బాలకృష్ణ... కొద్ది కాలం తర్వాత తన గతంలో సిబీఐ ఆఫీసర్ అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకోవటం....అక్కడ నుంచి తనను గతం మర్చిపోయేలా చేసిన వారి అంతుచూడటమే కథ అని వినిపిస్తోంది. అయితే ఇదే స్టోరీ పాయింటా లేక రూమరా అని తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.


ఈ నెల 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఉదయం 9 గంటల 36 నిమిషాలకు తొలి ఆట ప్రారంభించాలని కొత్త ముహూర్తం నిర్ణయించినట్టు నిర్మాత తెలిపారు.


Is Balayya's Lion Similar to Ravi teja's Power?

''బాలకృష్ణ సినీ ప్రయాణంలో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రమిది. ఆయన ఇమేజ్‌కి తగ్గట్టుగానే తీర్చిదిద్దారు దర్శకుడు. రెండు కోణాల్లో సాగే పాత్రలో బాలయ్య అభినయం ఆకట్టుకుంటుంది. మణిశర్మ సమకూర్చిన సంగీతం చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్లింద''ని చెప్పారు నిర్మాత.


''నాకు ఆటను వేటగా మార్చడానికి అరసెకను చాలు..'' అంటూ 'లయన్‌' చిత్రం కోసం ఉగ్రరూపం దాలుస్తున్నారు నందమూరి బాలకృష్ణ. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకొన్నాయి మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. పాటలకు వస్తున్న స్పందన పట్ల చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.


''భగవద్గీత యుద్ధానికి ముందు వినిపిస్తుంది... విని మారకపోతే చచ్చాక వినిపిస్తుంది. యుద్ధానికి ముందు వినిపించమంటావా, చచ్చాక వినిపించమంటావా'' అంటూ బాలకృష్ణ శక్తిమంతమైన సంభాషణలు పలికారు. ఇలాంటి పటాసుల్లాంటి డైలాగులు సినిమా నిండా ఉన్నాయట. ''బాలకృష్ణ రెండు రకాల పాత్రల్లో కనిపిస్తారు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠతను కలిగిస్తాయి'' అని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.


ఇక ఈ చిత్రానికి సంభందించి ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్ లో బాలకృష్ణ చెప్పిన మాస్ డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. బాలకృష్ణ మొదటిసారి ఓ పాత్రలో సిబిఐ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా కనిపించనున్నారు. బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం అన్ని కమర్షియల్ అంశాలతో సినీ అభిమానులని ఆకట్టుకోనుంది.


బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు

English summary
Balakrishna, Radhika Apte, Trisha's “Lion” directed by Satyadeva is readying for grand release on May 8 at 10.04 am. The rumors are spreading wide in industry about its story line as this film is almost similar to story of Ravi Teja’s “Power”.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu