»   »  చిరంజీవికి నో.. ఎన్టీఆర్‌ పేరు చెప్పగానే ఒప్పుకొన్నాడట..

చిరంజీవికి నో.. ఎన్టీఆర్‌ పేరు చెప్పగానే ఒప్పుకొన్నాడట..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంచలనాత్మకమైన కథతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 27వ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయడం ప్రత్యేక ఆకర్షణ. అయితే ఈ చిత్రం కోసం బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటించడానికి ఓకే చెప్పడం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.

 యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు చెప్పగానే ఓకే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు చెప్పగానే ఓకే

తమిళంలో రూపొందిన కత్తి చిత్రంలో నీల్ నితిన్ నటించారు. కత్తి రీమేక్ కోసం ఆయనను సంప్రదించగా కుదరదని నిరాకరించినట్టు అప్పట్లో టాక్. తాజాగా యంగ్ టైగర్ చిత్రంలో పాత్ర కోసం నిర్మాతలు మారోసారి ప్రయత్నించారు. అయితే తాము రూపొందించబోయే చిత్రంలో హీరో ఎన్టీఆర్ అని తెలియగానే మరోమాట చెప్పకుండా ఒకే చెప్పినట్టు ఓ రూమర్ ఫిల్మ్ నగర్‌లో ప్రచారం జరుగుతున్నది.

 బడ్జెట్ వందకోట్లు.. హాలీవుడ్ టెక్నీషియన్

బడ్జెట్ వందకోట్లు.. హాలీవుడ్ టెక్నీషియన్


వందకోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం హాలీవుడ్‌కు చెందిన సాంకేతిక నిపుణుడు వాన్సీ హార్ట్‌వెల్‌ను తీసుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. వాన్సీ హార్ట్ వెల్ ని ఇతను లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ఐరన్ మ్యాన్, లైఫ్ ఆఫ్ పై, రోబో వంటి హాలీవుడ్ సినిమాలకు పనిచేశారు. టెక్నాలజీని ఉపయోగించి మనుషులను విభిన్న రూపాల్లో కనిపించేలా చేయడం వాన్సీ ప్రత్యేకత. ఈ చిత్రానికి సీ కే మురళీధరన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నట్టు సమాచారం.

 మీడియాలో ఎన్టీఆర్, వాన్సీ ఫొటో హల్ చల్

మీడియాలో ఎన్టీఆర్, వాన్సీ ఫొటో హల్ చల్

త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం పేరు జై లవకుశగా ప్రచారం జరుగుతున్నది. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వాన్సీ హార్ట్ వెల్ ని కలిసి కథ చెప్పి ఒప్పించినట్లు తెలిసింది. వాన్సీ హార్ట్‌వెల్‌ను కలిసి ఎన్టీఆర్ తీసుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా హల్ చల్ చేస్తోంది.

 మూడు పాత్రలు ఇవే.. విలన్‌ రోల్‌లో ఎన్టీఆర్

మూడు పాత్రలు ఇవే.. విలన్‌ రోల్‌లో ఎన్టీఆర్


ఎన్టీఆర్ పోషించే పాత్రల పేర్లు జై, లవ, కుశ అని చెప్పుకొంటున్నారు. ఆ క్రమంలోనే చిత్రానికి ఆ పేరును పెట్టినట్టు సమాచారం. ఈ మూడు పాత్రలో ఒకటి విలన్ పాత్ర అని తెలుస్తున్నది. మరో రెండు పాత్రల్లో ఆచారీ పాత్ర ఒకటికాగా, మరోకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర అని తెలుస్తున్నది.

English summary
Junior NTR's next venture is getting ready. This movie has lot of surprises. There is a news viraling that Hollywood Technician Vannie Heartwell, Bollywood hero Neil Nitin Mukhesh given green signal to part of the film. NTR arts banner is producing and Bobby is director for this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu