మూడోసారి తల్లికాబోతోన్న ఇలియానా? ప్రెగ్నెన్సీపై అలాంటి సందేహాలు!
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రస్తుతం సినీతారలు ఒకరి తర్వాత ఒకరు గుడ్ న్యూస్ చెబుతున్నారు. ఇటీవల కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ జంట తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నట్లుగా ప్రకటించింది. టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి దంపతులకు మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. మరికొందరు స్టార్స్ విషయంలోనూ రూమర్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా డీ క్రూజ్ బాంబు పేల్చారు. ఈ వివరాల్లోకి వెళితే...
నడుము అందాలతో ఫేమ్
నడుము అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేశారు గోవా సుందరి ఇలియానా. ఈ ముద్దుగుమ్మను దర్శకుడు వైవీఎస్ చౌదరి దేవదాసు సినిమాతో తెలుగువారికి పరిచయం చేశారు. తొలి సినిమాతోనే తన క్యూట్ లుక్స్, అందంతో మత్తెక్కించారు ఇల్లీబేబ్. ఆ వెంటనే పోకిరి, మున్నా, ఆటా, జల్సా, కిక్, రెచ్చిపో, రాఖీ, జులాయి తదితర బ్లాక్ బస్టర్లతో ఇలియానాకు టాలీవుడ్‌లో తిరుగులేకుండా పోయింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లోనూ ఇలియానా పలు చిత్రాల్లో నటించారు.

వరుస ఫ్లాప్స్‌తో ఫేడవుట్
వరుస విజయాలతో ఇలియానా ఇంటికి దర్శక నిర్యాతలు క్యూకట్టేవారు.. ఆ సమయంలో కోటి రూపాయలకు పైగా పారితోషికం డిమాండ్ చేసి ఇండస్ట్రీలో కలకలం రేపారు ఈ ముద్దుగుమ్మ. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నట్లు... సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న ఆమె కెరీర్‌ను వరుస ఫ్లాప్స్ దెబ్బకొట్టాయి. తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో తన మకాంను బాలీవుడ్‌కు షిఫ్ట్ చేసింది ఇలియానా. హిందీలోనే సినిమాలు చేసినప్పటికీ అక్కడా ఫ్లాప్స్ రావడంతో ఆమె కెరీర్ డైలమాలో పడింది. దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనీ మూవీతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చారు ఇలియాన. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఆమెకు షాక్ తగిలింది. దీంతో తిరిగి బాలీవుడ్‌లోనే తన అదృష్టం పరీక్షించుకున్నారు.
భారత పౌరసత్వం వదులుకున్న ఇలియానా
సినిమాలతో పాటు ఎఫైర్లు, రిలేషన్స్‌తోనూ ఇలియానా వార్తల్లో నిలిచారు. తొలుత ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ నీబోన్ అనే ఫోటోగ్రాఫర్‌తో ప్రేమాయణం సాగించిన ఇలియానా 2019లో అతనికి బ్రేకప్ చెప్పేసింది. 2014 నాటికే భారతీయ పౌరసత్వాన్ని వదులకున్న ఇలియాన పోర్చుగీస్ పౌరసత్వాన్ని తీసుకున్నారు. ఆండ్రూతో విడిపోయిన తర్వాత మైఖేల్ డోలన్ అనే ఫారినర్‌తో ప్రేమలో పడిన ఇలియానా.. ఈ క్రమంలో ప్రెగ్నెంట్ అయ్యింది. 2023 ఆగస్ట్‌లో ఓ బాబుకు జన్మనిచ్చి ఆ ఏడాదే డోలన్‌ని పెళ్లాడింది. తమ బాబుకి కోవా ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టుకుంది. ఆ తర్వాత కొద్దిరోజులకే ఇలియానా రెండోసారి గర్భం దాల్చింది.. ఈ ఏడాది జూన్ 19న రెండోసారి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ చిన్నారికి కీను రాఫే డోలన్ అని పేరు పెట్టుకుంది.
మూగోసారి ప్రెగ్నెంట్ అయిన ఇలియానా?
ప్రస్తుతం సినిమాలకు దూరంగా భర్త, తన పిల్లలే ప్రపంచంగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు ఇలియానా. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. తాజాగా పోస్ట్ చేసిన వీడియో ఆమె అభిమానులకు షాకిచ్చింది. ఇందులో ఆమె బేబీ బంప్‌తో కనిపించడంతో ఇలియానా మూడోసారి ప్రెగ్నెంట్ అయ్యారని అందరూ భావిస్తున్నారు. ఇందులో వైట్ డ్రెస్‌లో తన పిల్లాడిని ఊయలలో వేసి దానిని సర్దుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. రెండో బిడ్డను ప్రసవించి నాలుగు నెలలు కాకుండానే ఇలియానా మూడోసారి తల్లయ్యారా? అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇలియానా ప్రెగ్నెంట్ కాలేదని.. ఇది రెండోసారి ప్రెగ్నెంట్ అయినప్పటి వీడియో అని కొందరు చెబుతున్నారు. ఈ గందరగోళానికి తెరపడాలంటే స్వయంగా ఇలియానా స్పందించాల్సిందే.


Click it and Unblock the Notifications











