»   »  చిరు...150 వ చిత్రం స్టోరీ లైన్ ఇదేనా?

చిరు...150 వ చిత్రం స్టోరీ లైన్ ఇదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా గురించే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్. ఆయన 150వ సినిమాకు దర్శకత్వం వహించబోయే దర్శకుడుగా పూరి జగన్నాత్ ఖరారవటమే ట్రెండింగ్ నిలిచింది. ఇప్పుడు అందరి దృష్టీ ...ఈ చిత్రం కథ ఏమై ఉండబోతుందనే విషయమై చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్న సమచారం ప్రకారం...ఈ చిత్రంలో చిరంజీవి..ఆటో జానీ గానూ, ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి గానూ ద్విపాత్రాభినయం చేస్తారు. ఆటో జానీగా పక్కా మాస్ క్యారక్టరైజేషన్ తో ఉండే ఈ పాత్ర... ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ... కథ విని (ఫ్లాష్ బ్యాక్ క్రింద వస్తుంది) తో ప్రేరణ పొంది...ఏం చేస్తుంది....ఇప్పటి మన సమాజానికి ఏం చేస్తాడు...ఇక్కడ ఉన్న పరిస్ధితులపై తిరుగుబాటు ఎలా చేస్తాడు అనేదే కథలో ఆసక్తికరమైన అంశమని చెప్పుకుంటున్నారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి గుర్తు చేసుకుంటే...

1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరి లో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాళెగాండ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకడు. కంపెనీ దొరతనము ఎదిరించి వీరమరణం పొందినాడు.

Is it Chiranjeevi's 150th film Story?

బ్రిటిషు ప్రభుత్వం రాయలసీమలోని పాలెగాళ్ల ఆస్తులు, మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఉద్దేశ్యంతో, వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేసి, వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది.

ఉయ్యాలవాడకు పాలెగాడు గా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారు, నొస్సం జమీదారు అయిన చెంచుమల్ల జయరామిరెడ్డి నిస్సంతు కావడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల, 10 అణాల, 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన, జయరామిరెడ్డి నిస్సంతుగా మరణించాడనే నెపంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో రద్దుచేసింది బ్రిటిషు ప్రభుత్వం.

1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపగా, అక్కడి తాసీల్దారు, ఆ వ్యక్తిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడి దారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, అవుకు జమీందార్లు, హైదరాబాదుకు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరినవారిలో ఉన్నారు.

1846 జూలై 10వ తేదీ రెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి,ఖజానాలోని 805 రూపాయల, 10 అణాల, 4 పైసలను దోచుకున్నాడు.ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను కూడా దోచుకున్నాడు. బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్‌ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. రెడ్డిని పట్టి ఇచ్చినవారికి వేయిరూపాయల బహుమానాన్ని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది.

English summary
Buzz is Chiru will be seen as Auto Jani and freedom fighter Uyyalawada Narasimha Reddy in his 150 th movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu