twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్: 'గబ్బర్ సింగ్ 2' కథ ఇదా?

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్ కొత్త చిత్రం 'గబ్బర్ సింగ్ 2' రెండు రోజల క్రితమే లాంచ్ అయ్యింది. అప్పుడే ఈ చిత్రం కథ ఇదీ అంటూ నెట్ లో రకరకాల కథనాలు ప్రచారం మొదలయ్యాయి. తమ అభిమాన హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో దానికి తగినట్లే ఈ చిత్రం కథలు అల్లి ప్రచారం చేస్తున్నారని కొందరు అంటున్నారు. ప్రచారం అవుతున్న కథలో నిజమెంత ఉందో కానీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో పవన్ అభిమానులను అలరింపచేస్తోంది. ఇంతకీ ఏంటా కథ అంటే...

    ఈ సారి గబ్బర్ సింగ్ చంబల్ లోయలో పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా ఉంటూంటారు. ఇంటర్వెల్ వరకూ పవన్ పోలీస్ అథికారిగా అదరకొడతారు. ఇంటర్వెల్ దగ్గర ఓ రాజకీయనాయకుడుతో గొడవ జరిగి,అది పెద్దదై ఛాలెంజ్ విసురుకునేదాకా వస్తుంది. దాంతో పవన్ పొలిటీషిన్ గా మారతారు. అక్కడ నుంచి మిగతా రాజకీయ నాయకుల గుండెళ్లో రైళ్లు పరుగెట్టించి,వ్యవస్ధలో మార్పు తెస్తాడు. దీన్నే సంపత్ నంది చాలా ఇంట్రస్టింగ్ గా స్క్రిప్టు చేసాడని చెప్పుకుంటున్నారు. ఈ కథా వంటకంలో నిజా నిజాలు ఎలా ఉన్నా పవన్ ని ఇప్పుడున్న రాజకీయ వ్యవస్ధపై ప్రయోగించాలనే ఆలోచన చాలా మందికి నచ్చుతోందనేది మాత్రం నిజం.

    Is it Gabbar Singh 2 story?

    నాక్కొంచెం తిక్కుంది... దానికో లెక్కుంది అంటూ 'గబ్బర్‌సింగ్‌'గా పవన్‌ కల్యాణ్‌ ప్రేక్షకులకు వినోదం పంచారు. ఆ చిత్రానికి కొనసాగింపుగా 'గబ్బర్‌సింగ్‌ 2' తెరకెక్కుతుందని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. అభిమానులు కూడా ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే... అది 'గబ్బర్‌సింగ్‌'కి కొనసాగింపు కాదట. కొత్త కథతో తెరకెక్కిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం.

    నిర్మాత మాట్లాడుతూ ''ఈ సినిమాకి సంబంధించిన కథ, రచన వ్యవహారాలన్నీ పవన్‌కల్యాణ్‌ పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. ఓ కొత్త కథతో రూపొందుతున్న ఈ సినిమాను మేలో సెట్స్‌పైకి తీసుకెళతాం. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.

    పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న 'గబ్బర్‌సింగ్‌ 2' చిత్రానికి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌ మరార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచనా పర్యవేక్షణ: సత్యానంద్‌, క్రియేటివ్‌ హెడ్‌: హరీష్‌పాయ్‌, రచనా సహకారం: శ్రీధర్‌ సీపాన, కిషోర్‌ గోపు, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి.

    English summary
    
 Gabbar Singh 2 is set in Chambal Valley backdrop and Pawan will be seen as powerful cop till interval. In a weird situation, the powerful police officer (Pawan Kalyan) turns into a politician in second half to teach baddies a political lesson. This is the brief story. How Pawan Kalyan uses his political power to revolt on goons and awakening of tribal people is interestingly scripted by Sampath Nandi. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X