»   » ఎన్టీఆర్,సుక్కు టైటిల్ “దండయాత్ర” కాదు మరి...

ఎన్టీఆర్,సుక్కు టైటిల్ “దండయాత్ర” కాదు మరి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి టైటిల్ గా "దండయాత్ర" టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆ టైటిల్ కాదని, "నాన్నకు ప్రేమతో..." అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రి,కొడుకుల సెంటిమెంట్ నేపధ్యంలో జరిగే ఈ కథకు ఈ టైటిల్ యాప్ట్ అని భావిస్తున్నారని, అయితే ఎన్టీఆర్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఏ టైటిల్ ఫైనల్ చేస్తారో...ఇంతకీ టైటిల్ ఎలా ఉందంటారు.

మిగతా విశేషాలుకు వస్తే..

ఈ చిత్రానికి సంభందించి అందుతున్న తాజా సమాచారం ప్రకారం సుకుమార్ మరియు సంగీత దర్శకుడు దేవి తన బృందంతో కలిసి స్పెయిన్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ కి వెళ్ళారు. ఈ సినిమాకి ట్యూస్స్ సమకూర్చే పనిలో ఏప్రిల్ 9వరకూ అక్కడే గడపనున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Is it Sukumar, NTR’S movie title?

ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్రకు జగపతిబాబుని ఎంపిక చేసుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

టెంపర్ హిట్తో మంచి జోష్ మీద ఎన్టీఆర్ తన నెక్ట్స్ చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో 25 వ చిత్రం. ఈ చిత్రాన్ని సుకుమార్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం అఫీషియల్ లాంచింగ్ ని యుకే లో చేస్తున్నట్లు సమాచారం.

అక్కడ షూటింగ్ రెగ్యులర్ గా జరుపుతాం కాబట్టి అక్కడే లాంచింగ్ పెట్టుకుంటే మంచిదని ఈ నిర్ణయానికి దర్శక,నిర్మాతలు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సుకుమార్ గత చిత్రం 1,నేనొక్కిడినే గ్లోబల్ మార్కెట్ లోనే మనకు ఇక్కడ లోకల్ కన్నా ఎక్కవ కలెక్టు చేయటం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి ఓ కారణం అని చెప్తున్నారు.

అలాగే అక్కడ ఓ తెలుగు చిత్రం లాంచింగ్ అనేది ఇప్పటివరకూ జరగలేదు కాబట్టి హైలెట్ గా నిలుస్తుంది...అంతేకాకుండా అక్కడ ఉండే మన తెలుగు వారికీ ఆనందం కలిగించినట్లు ఉంటుందని ఎన్టీఆర్ భావించి,గ్రీన్ సిగ్నల్ ఇచ్చిట్లు చెప్తున్నారు. దీంతో ఓవర్ సీస్ మార్కెట్ లో సైతం ఎన్టీఆర్ కు క్రేజ్ పెరిగే అవకాసం ఉంది. జనవరి 8,2016న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నవంబర్ దాకా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేయనుంది. జగపతిబాబు కీలకమైన పాత్రలోనూ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తారు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోనుంది.

ఎన్టీఆర్, సుకుమార్ తొలి కాంబినేషన్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రం పూజా కార్యక్రమాలు డిసెంబర్ 18 ఉదయం 11.39 గంటలకు సంస్ధ కార్యాలయం చెన్నైలో జరిగాయి.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కు డిఫెరెంట్ మూవి అవుతుంది. సబ్జెక్టు చాలా ఎక్సట్రార్డనరీగా ఉంది అన్నారు.

English summary
Ntr have given nod to work under Sukumar. The makers of the movie are considering the title “Naanaku Prematho.”
Please Wait while comments are loading...